వ్యాపారవేత్త పోస్ట్... సోషల్ మీడియా షేక్

ABN , First Publish Date - 2021-10-17T21:17:02+05:30 IST

కొన్ని దృశ్యాలు చూడగానే ఆకట్టుకుంటాయి., కళ్లలోనే గూడు కట్టుకుంటాయి., అలాంటి దృశ్యాన్నే ఓ రోజు శిఖారథి చూశారు. రీఅప్ స్టూడియో అనే వినూత్న బ్రాండ్‌ వ్యవస్థాపకురాలు ఆమె. తన స్నేహితురాలితో కలిసి పుణెలోని ఎంజీ రోడ్డుకు వెళ్లారు. అక్కడ ఓ దృశ్యం ఆమెను కట్టిపడేసింది.

వ్యాపారవేత్త పోస్ట్...  సోషల్ మీడియా షేక్

ముంబై : కొన్ని దృశ్యాలు చూడగానే ఆకట్టుకుంటాయి., కళ్లలోనే గూడు కట్టుకుంటాయి., అలాంటి దృశ్యాన్నే ఓ రోజు శిఖారథి చూశారు. రీఅప్ స్టూడియో అనే వినూత్న బ్రాండ్‌ వ్యవస్థాపకురాలు ఆమె. తన స్నేహితురాలితో కలిసి పుణెలోని ఎంజీ రోడ్డుకు వెళ్లారు. అక్కడ ఓ దృశ్యం ఆమెను కట్టిపడేసింది. ముడతలు పడిన బక్కపలుచనిశరీరం.,.  అయితేనేం... వన్నె తరగని చిరునవ్వు. ముందర చెక్క పెట్టె నిండా రంగురంగుల పెన్నులు. చేతిలో ఓ అట్ట ముక్క., అందులో ఓ అద్భుతమైన స్లోగన్... దానిని  అనాలో, ఆమె వ్యక్తిత్వమనాలో అర్ధం కాదు. కానీ అది ఎందరికో స్ఫూర్తినిచ్చింది. ఆ వృద్ధురాలు... దాదాపు 80 ఏళ్ల వయసులో పెన్నులు విక్రయిస్తోంది. పెన్నులు విక్రయించడం పెద్ద విషయమేమీ కాదు కానీ, ఆ అట్టముక్కపై ఆమె రాసిన అక్షరాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. శిఖా రథి ఆ వృద్ధురాలిని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్, షేర్ చేశారు. అది చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. క్షణాల్లో ఈ పోస్టు వైరల్ అయిపోయింది. ఇంతలా వైరల్ అవడానికి కారణం... ఆ వృద్ధురాలి చేతిలోని అట్టముక్కలోని అక్షరాలే. ‘నేను భిక్షమెత్తుకోవాలనుకోవడం లేదు. బ్లూ కలర్ పెన్నులు రూ. 10.,  దయచేసి కొనండి... థాంక్యూ. బ్లెస్  ఆఫ్ యూ’ అని రాసి ఉంది. దీనిని చూసి ముగ్దురాలైన రథి ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.  ‘ఈ రోజు నేను రియల్ లైఫ్ హీరో, ఛాంపియన్ రతన్‌ను కలిశాను. నేను నా స్నేహితురాలితో కలిసి బయటకు వెళ్లినప్పుడు రతన్‌ను కలిశా. ఆమె నోట్‌ను మేము చదివిన వెంటనే నా ఫ్రెండ్ వెంటనే ఓ పెన్నును కొనుగోలు చేసింది. రతన్ చాలా సంతోషపడింది. ఆ సమయంలో మేము ఆమె కళ్లలో కృతజ్ఞతతో కూడిన ఆరాధ భావాన్ని చూడగలిగాము. ఆమె మాకు దన్యవాదాలు తెలిపింది. మమ్మల్ని మరికొన్ని పెన్నులను కొనమని బలవంత పెట్టడం వంటివేమీ చేయలేదు. ఆమె ఇంటెగ్రిటీతో కూడిన అందమైన చిరునవ్వు, దయతో కూడిన హృదయం, అద్భుతమైన వైఖరి మమ్మల్ని మరికొన్ని పెన్నులు కొనేలా చేసింది. ఆమె చిరునవ్వు’ అని పేర్కొంది.  ఆమె కథ షేర్ చేయడానికి అర్హమైనది కాబట్టే ఈ పోస్ట్ అని, మీరు కనుక పుణేలోని ఎంజీ రోడ్డుకు వెళితే... ఆమెతో కాసేపు మాట్లాడి, పెన్నులను కొనుగోలు చేయండి అని కోరింది. ఈమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయ్యింది.  

Updated Date - 2021-10-17T21:17:02+05:30 IST