14600 వద్ద కన్సాలిడేషన్‌

ABN , First Publish Date - 2021-01-25T08:03:45+05:30 IST

14600 వద్ద కన్సాలిడేషన్‌

14600 వద్ద కన్సాలిడేషన్‌

నిఫ్టీ గత వారం కరెక్షన్‌ ట్రెండ్‌లో ప్రారంభమైనప్పటికీ 14200 పాయింట్ల రికవరీ కనబరిచింది. కన్సాలిడేషన్‌, ఆటుపోట్ల ట్రెండ్‌ను కనబరుస్తూ చివరకు స్వల్ప నష్టంతో క్లోజైంది. మార్కెట్‌ ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువనే కొనసాగుతూ టెక్నికల్‌గా ఎలాంటి ట్రెండ్‌ పొజిషన్‌ను సూచించటం లేదు. పన్నెండు వారాల ర్యాలీ అనంతరం మైనర్‌ కరెక్షన్‌ను కనబరిచింది. ప్రస్తుతం ఓవర్‌బాట్‌ పొజిషన్‌ను సర్దుబాటు చేసుకుంటోంది. మున్ముం దు కరెక్షన్‌లోకి జారుకునే అవకాశం ఉండటంతో స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. మార్కెట్లు గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నప్పటికీ గత కొన్ని రోజులుగా చాలా స్టాక్స్‌... కరెక్షన్‌ను చవిచూసాయి. 


బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ రికవరీ కనబరిస్తే తదుపరి  నిరోధ స్థాయిలు 14520గా ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకుంటే అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. తదుపరి నిరోధ, టార్గెట్‌ స్థాయి 14600


బేరిష్‌ స్థాయిలు: నిరోధ స్థాయిలైన 14500 వద్ద నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయి 14350. ఈ స్థాయిలకన్నా దిగజారితే 14200 వద్ద తదుపరి మద్దతు స్థాయిలుంటాయి. 


బ్యాంక్‌ నిఫ్టీ: సానుకూల ట్రెండ్‌ను సూచిస్తే తదుపరి నిరోధ స్థాయి 31700 ఎగువన ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది. మరో ప్రధాన నిరోధం 32000. ఒకవేళ ఏదైనా రియాక్షన్‌ను కనబరిస్తే 30800 దిగువన మద్దతు స్థాయిలుంటాయి. 


పాటర్న్‌: నిఫ్టీ 14600 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద గట్టి నిరోధం ఎదుర్కొంటోంది. అలాగే 14200 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద మద్దతు ఉంది. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక కరెక్షన్‌కు సంకేతం.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి రివర్సల్‌ ఉంది.


సోమవారం స్థాయిలు

నిరోధం : 14460, 14520 

మద్దతు : 14360, 14300


www.sundartrends.in

Updated Date - 2021-01-25T08:03:45+05:30 IST