మధ్యాహ్నం వరకే వ్యాపార, వాణిజ్య దుకాణాలు

ABN , First Publish Date - 2021-04-23T04:51:01+05:30 IST

చేర్యాల పట్టణంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మునిసిపల్‌ పాలకవర్గం గురువారం కీలక తీర్మాణం చేసింది. ఈనెల 23 నుంచి 30వరకు వర్తక, వాణిజ్యసంస్థలు, చికెన్‌, మటన్‌షాప్‌, కూరగాయల దుకాణాలను మధ్యాహ్నం 2గంటలకే మూసివేయాలని చేయాలని నిర్ణయించారు.

మధ్యాహ్నం వరకే వ్యాపార, వాణిజ్య దుకాణాలు

చేర్యాల, ఏప్రిల్‌ 22: చేర్యాల పట్టణంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మునిసిపల్‌ పాలకవర్గం గురువారం కీలక తీర్మాణం చేసింది. ఈనెల 23 నుంచి 30వరకు వర్తక, వాణిజ్యసంస్థలు, చికెన్‌, మటన్‌షాప్‌, కూరగాయల దుకాణాలను మధ్యాహ్నం 2గంటలకే మూసివేయాలని చేయాలని నిర్ణయించారు. అత్యవసర సేవల నిమిత్తం మెడికల్‌ దుకాణాలకు మినహాయింపు ఉంటుందని కమిషనర్‌ రాజేంద్రకుమార్‌ తెలిపారు. నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఈనెల 27న నిర్వహించనున్న వారాంతపు సంతను కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు. దుకాణాల బందుకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కిరాణవర్తక సంఘం అధ్యక్షుడు శేరి బాలనారాయణ తెలిపారు.


 

Updated Date - 2021-04-23T04:51:01+05:30 IST