కళాశాల బస్సు దగ్ధం

ABN , First Publish Date - 2022-05-16T05:39:21+05:30 IST

నిలిపి ఉంచిన బస్సులో ఆకస్మా త్తుగా మంటలు చెలరేగాయి.

కళాశాల బస్సు దగ్ధం
దగ్ధమైన బస్సు

పెదపాడు, ఏలూరు క్రైం, మే 15 : నిలిపి ఉంచిన బస్సులో ఆకస్మా త్తుగా మంటలు చెలరేగాయి. సమీపంలో వున్న విద్యార్థినులు వెంటనే అప్రమత్తమయ్యారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సకాలంలో మంటలను అదుపు చేశారు. ఏలూరు జిల్లా వట్లూరులోని సీఆర్‌ఆర్‌ మహిళా కళాశాల కళాశాలకు చెందిన బస్సులను కళాశాల ఆవరణలో పార్కింగ్‌ చేశారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక బస్సు నుంచి ఆకస్మాత్తుగా పొగ, మంటలు వచ్చాయి. సమీపంలోని హాస్టల్‌ విద్యార్థినులు చూసి బకెట్లతో నీళ్లు తీసుకెళ్లి పోశారు. అయినా మంటలు అదుపు కాకపోవడంతో ఫైర్‌ సిబ్బం దికి సమాచారం ఇచ్చారు. జిల్లా అగ్నిమాపక సహాయాధికారి వీవీ రామ కృష్ణ తన సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి ఎలక్ట్రికల్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఎలుకలు బ్యాటరీ వైర్లు కొరకడం వల్ల ప్రమాదానికి కారణంగా భావి స్తున్నారు. ఆ బస్సు స్టార్ట్‌ చేయడానికి సంబంధించిన తాళం కూడా దానికే పెట్టి ఉండటం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. 


Updated Date - 2022-05-16T05:39:21+05:30 IST