Turkey: ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

ABN , First Publish Date - 2021-07-11T23:09:51+05:30 IST

ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చి వలసదారులు.. టర్కీ గుండా యూరప్ వెళ్తున్నారు. అక్రమంగా వలస వెళ్తున్న కారణంగా దొంగ దారులను ఎంచుకున్నారు. ఇరాన్ సరిహద్దులో గల వాన్ నగరం సమీపంలో ప్రయాణిస్తుండగా

Turkey: ఘోర ప్రమాదం.. 12 మంది మృతి

అంకారా: టర్కీలో శనివారం రాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మరో 26 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వలసదారులను తీసుకువెళ్తున్న ఓ బస్సు టర్కీలోని ఇరాన్ సరిహద్దు వద్ద ప్రమాదానికి గురైందని టర్కీలోని స్థానిక మీడియా పేర్కొంది. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు టర్కీ పోలీసులు తెలిపారు.


ఆఫ్గనిస్తాన్ నుంచి వచ్చి వలసదారులు.. టర్కీ గుండా యూరప్ వెళ్తున్నారు. అక్రమంగా వలస వెళ్తున్న కారణంగా దొంగ దారులను ఎంచుకున్నారు. ఇరాన్ సరిహద్దులో గల వాన్ నగరం సమీపంలో ప్రయాణిస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. గతంలో కూడా ఇలాంటి ఓ ప్రమాదమే వాన్ సిటీ వద్ద జరిగింది. వలసదారులతో వెళ్తున్న పడవ వాన్ సరస్సులో మునిగిపోవడంతో 60 మంది మరణించారు.

Updated Date - 2021-07-11T23:09:51+05:30 IST