బస్సూ కాదు.. బోటు కాదు.. ఇది bus boat..!

ABN , First Publish Date - 2021-07-19T06:41:37+05:30 IST

నదిలో బోట్‌లో కూర్చుని ప్రకృతి అందాలను చూడాలని ఎవరికి ఉండదు. అలా అలా పడవలో వెళుతూ నీటి అలలపై తేలుతూ ..

బస్సూ కాదు.. బోటు కాదు.. ఇది bus boat..!

శ్రీనగర్: నదిలో బోట్‌లో కూర్చుని ప్రకృతి అందాలను చూడాలని ఎవరికి ఉండదు. అలా అలా పడవలో వెళుతూ నీటి అలలపై తేలుతూ వెళ్లడమంటే ఇష్టపడని వారుంటారా..? అయితే ఇప్పుడు దానికి అదనంగా మరిన్ని లగ్జరీ హంగులతో ఓ బస్ బోట్ మీకోసం రెడీ అయింది. ఫైబర్ గ్లాసుల కిటికీలతో చూడడానికి అచ్చం బస్సులానే ఉంటుందీ బస్ బోట్. ఇందులో 30 మంది సీటింగ్‌కు అనుకూలంగా దీనిని అమర్చారు. ఇందులో మ్యూజిక్ కోసం అదిరిపోయే సౌండ్ సిస్టంను కూడా ఏర్పాటు చేశారు. బస్సులాంటి ఓ వినూత్నమైన లగ్జరీ బస్ బోట్‌ను ఈ రోజు టెస్ట్ డ్రైవ్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ప్రవహిస్తున్న జీలం నదిపై ఈ బస్ బోట్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ బస్ బోట్‌లో అన్ని రకాల అధునాతన సౌకర్యాలను అమర్చారు.


ఈ బస్ బోట్ గురించి షిస్ డ్రైవర్ గౌతం బోస్లే మాట్లాడుతూ.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం ఈ బస్ బోట్ వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇందులో కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లు జరుపునేందుకు ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని, టూరిస్టులకు ఇందులో ప్రయాణించడం గొప్ప అనుభూతని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌కు అప్పుడప్పుడూ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయని, అలాంటి సమయంలో ఈ బస్ బోట్ చక్కగా ఉపయోగపడుతుందని వివరించారు. మరి ఈ అద్భుతమైన, లగ్జరీ బస్ బోట్‌లో ప్రయాణించాలంటే జమ్మూ కాశ్మీర్ వెళ్లాల్సిందే మరి.

Updated Date - 2021-07-19T06:41:37+05:30 IST