ఓవర్‌టేక్‌ చేయబోయి.. మరో బస్సును ఢీకొట్టి

ABN , First Publish Date - 2020-11-28T04:44:52+05:30 IST

ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును అతివేగంతో ఢీకొట్టి.. ఆ తర్వాత అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో శుక్రవారం జరిగింది.

ఓవర్‌టేక్‌ చేయబోయి.. మరో బస్సును ఢీకొట్టి
చెట్టును ఢీకొట్టిన సత్తుపల్లి బస్సు

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఆర్టీసీబస్సు 

15మంది ప్రయాణికులకు గాయాలు

కొణిజర్ల మండలం తనికెళ్ల వద్ద ఘటన

కొణిజర్ల, నవంబరు 27 : ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న బస్సును అతివేగంతో ఢీకొట్టి.. ఆ తర్వాత  అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల సమీపంలో శుక్రవారం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15మందికి గాయాలయ్యాయి. కొణిజర్ల ఎస్‌ఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి నుంచి ఖమ్మం వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ తనికెళ్ల సమీపంలో ముందు వెళుతున్న ఓ లారీని ఓవర్‌టేక్‌ చేస్తూ ఎదరుగా ఖమ్మం నుంచి మణుగూరు వెళ్లుతున్న మరో అర్టీసీ బస్సును ఢీకొట్టి.. రోడ్డుపక్కన ఉన్న భారీ చెట్టును డీకొట్టాడు. ఈ ప్రమాదంలో సత్తుపల్లి నుంచి ఖమ్మం వస్తున్న బస్సులోని సుమారు 15మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నండ్రు రాజేంద్రప్రసాద్‌, నగేష్‌, వాణి, స్వరాజ్యం, ఏసురత్నం, సాయికిరణ్‌తోపాటు మరికొంత మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రెండు 108 వాహనాల్లో ద్వారా ఖమ్మం తరలించారు. మణుగూరు బస్సులోని ప్రయాణికులు ఎవరకీ ఏమికాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ బస్సులో 30మంది ఉండగా సత్తుపల్లి బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రుల వివరాలను సేకరించి, సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేశామని ఎస్‌ఐ వివరించారు. 


Updated Date - 2020-11-28T04:44:52+05:30 IST