హైదరాబాద్: తెలంగాణ బి.సి. సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, రచయిత బుర్రా వెంకటేశం(burra venkatesam) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఈ నెల 19వ తేదీ గురువారం రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక లైవ్ కార్యక్రమంలో పాల్గొంటారని టి-సాట్ సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి(shailesh reddy)ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలపై అవగాహన’ కార్యక్రమంలో భాగంగా 19వ తేదీన సాయంత్రం 3.30 గంటల నుండి టి-సాట్ నిపుణ ఛానల్ లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో చదివి ఐఏఎస్ అఖిలభారత 15వ ర్యాంకు సాధించి గత 27 సంవత్సరాలుగా ప్రభుత్వానికి సేవలందిస్తున్న బుర్రా వెంకటేశం ఐఏఎస్ అధికారిగా తన అనుభవాలు ప్రస్తుతం పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు వివరించనున్నారు.
ఏదేనీ పనిలో విజయం సాధించాలంటే ఎలా కృషి చేయాలో వివరిస్తూ ఇటీవలే అంగ్లంలో రచించిన ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకంలో తన అనుభావాలను పంచుకుని దానిని తెలుగు విభాగం విద్యార్థులకూ అందుబాటులో ఉండే విధంగా ‘గెలుపు-పిలుపు’ పేరుతో అనువదించిన ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సలహాలు-సూచనలు పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు పొందాలని సీఈవో సూచించారు. తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసే గ్రూప్-1, పోలీసు, టెట్ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులతో పాటు భవిష్యత్ లో నోటిఫికేషన్ విడుదలయ్యే ఉద్యోగాలకూ బుర్రా వెంకటేశం సలహాలు ఉపయోగపడతాయని శైలేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి