క్యాబ్ డ్రైవర్‌పై కత్తితో బురఖా మహిళ దాడి

ABN , First Publish Date - 2022-02-15T21:06:14+05:30 IST

హర్యానాలోని గురుగావ్‌ సైబర్ సిటీ ఏరియాలో మంగళవారం ఉదయం జరిగిన ఒక..

క్యాబ్ డ్రైవర్‌పై కత్తితో బురఖా మహిళ దాడి

గురుగావ్: హర్యానాలోని గురుగావ్‌ సైబర్ సిటీ ఏరియాలో మంగళవారం ఉదయం జరిగిన ఒక ఘటన సంచలనం సృష్టించింది.  ఒక క్యాబ్ డ్రైవర్‌పై బురఖా ధరించిన మహిళ కత్తితో దాడిచేసింది. దీంతో పోలీసులు భారీగా ఆ ప్రాంతంలో మోహరించారు. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ రఘురాజ్ గాయపడ్డాడు.


రఘురాజ్ కథనం ప్రకారం, బురఖా మహిళ క్యాబ్‌ ఎక్కగానే కత్తితో అతనిపై దాడికి దిగింది. అ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే గాయాలను కూడా లెక్కచేయకుండా రఘురాజ్ ఆమెను ఛేజ్ చేశాడు. ఆ పరిసర ప్రాంతంలోనే ఉన్న పీసీఆర్ వ్యాన్ ఈ విషయం గ్రహించి పారిపోతున్న మహిళను పట్టుకుంది. దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఆమె విదేశీయురాలని తెలుస్తోందని, అయితే ఆమె పూర్తి వివరాలు ఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు.

Updated Date - 2022-02-15T21:06:14+05:30 IST