return of Taliban: పదిరెట్లు పెరిగిన బుర్ఖాల ధరలు

ABN , First Publish Date - 2021-08-18T13:48:03+05:30 IST

ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కాబూల్ నగరంలో బురఖాల ధరలు పదిరెట్లు పెరిగాయి.....

return of Taliban: పదిరెట్లు పెరిగిన బుర్ఖాల ధరలు

కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కాబూల్ నగరంలో బురఖాల ధరలు పదిరెట్లు పెరిగాయి. తాలిబాన్ల రాకతో ఆఫ్ఘాన్ లో మహిళలు భయపడి బుర్ఖాలు ధరిస్తున్నారు. దీంతో బురఖాల కోసం విపరీతంగా డిమాండ్ పెరగడంతో వీటి ధరలు ఆకాశన్నంటాయి.గతంలో తాలిబాన్ల పాలనలో మహిళలు తమ శరీరంతోపాటు ముఖాన్ని బుర్ఖాలో కప్పుకునేవారు. మగ బంధవు లేకుండా మహిళలు ఇల్లు దాటి బయటకు రావడాన్ని తాలిబాన్లు నిషేధించారు.కాబూల్ నగరంలోని ఓ కుటుంబంలో మహిళకు సోదరి, తల్లి ఉండగా రెండు బుర్ఖాలు మాత్రమే ఉన్నాయి.బురఖా లేకపోతే ఒక బెడ్ షీట్ అయినా కప్పుకోవాలని ఆఫ్ఘాన్ మహిళ చెప్పారు. 


తాలిబాన్ల రాకతో మహిళలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.మహిళా వైద్యులు కూడా ఇంటికే పరిమితం అయ్యారు.‘‘నేను తాలిబాన్ యోధులను ఎదుర్కోలేను, వారిపట్ల నాకు మంచి అభిప్రాయం లేదు, మహిళల విషయంలో తాలిబాన్ల వైఖరిని ఎవరూ మార్చలేరు, అందుకే మహిళలంతా ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నారు’’ అని ఓ అఫ్ఘాన్ మహిళ చెప్పారు. తాలిబాన్ల పాలనలో నీలిరంగు బుర్ఖాను ధరించాలని ఆదేశాలు జారీ చేశారని, కాని దాన్ని నేను అంగీకరించనని, నా హక్కుల కోసం పోరాడుతానని మరో అఫ్ఘాన్ మహిళ చెప్పారు.

Updated Date - 2021-08-18T13:48:03+05:30 IST