మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో దగ్ధమవుతున్న ట్రాక్టర్
మద్దూరు, మే 27: గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌తీగలు తగిలి దగ్ధమైన సంఘటన శుక్రవారం మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాపాక నర్సింహారెడ్డి తన వ్యవసాయ బావి నుంచి తాడూరి శ్రీనివా్‌సకు చెందిన ట్రాక్టర్‌పై గడ్డివాము లోడు చేసుకుని తరలిస్తున్నారు. మార్గంమధ్యలో విద్యుత్ తీగలు తగలడంతో గడ్డివాముతో పాటు ట్రాక్టర్ దగ్ధమైంది.