ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2021-01-25T05:27:57+05:30 IST

: పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పి మాటమార్చిన ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. న గరంలోని బోర్గాం (పీ) బ్రిడ్జి వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుల ఆఽ ద్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను తగలబెట్టారు.

ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మ దహనం
కమ్మర్‌పల్లిలో ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దృశ్యం

మోపాల్‌, జనవరి 24: పసుపు బోర్డును తీసుకొస్తానని చెప్పి మాటమార్చిన  ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను ఆదివారం దహనం చేశారు. న గరంలోని బోర్గాం (పీ) బ్రిడ్జి వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుల ఆఽ ద్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డును తీసుకొస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన ఎంపీ అర్వింద్‌ ఇప్పటి వరకు తీసుకురాకపోవడంపై మండిపడ్డారు. జిల్లా రైతులు పసుపు బోర్డు వస్తుందని ఎదురు చూస్తున్నారని తెలిపారు. మాయమాటలతో కాలయాపన చేస్తున్నారే తప్ప పసుపుబోర్డును తీసుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు తీసుకురాలేకపోతే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ యువ నాయకుడు నవనీత్‌ రెడ్డి, ఆయా గ్రామాల యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

నిజామాబాద్‌ నగరంలో..

నిజామాబాద్‌ అర్బన్‌: పసుపు రైతులను మోసం చేశాడని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్‌ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీ అర్వింద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు విజయ్‌, గులాబ్‌సింగ్‌, శ్రావణ్‌, శివ, వంశీకృష్ణ, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు. 

కమ్మర్‌పల్లిలో..

కమ్మర్‌పల్లి: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పసుపు బోర్డు విషయంలో రైతులను మోసం చేయడంతో పాటు రైతులతో ముఖాముఖిలో రైతుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లి పోవడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్ల అనుచితంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ ఆదివారం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత శ్రీకుమార్‌, యువ నాయకులు పాల్గొన్నారు. 

నవీపేటలో...

నవీపేట: మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఎంపీ ధర్మపురి అర్వింద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కార్యదర్శి సాయికుమార్‌ గౌడ్‌, కార్యక్రమంలో జనార్ధన్‌, భూమయ్య, హర్షద్‌, అజ్జు, ఇమ్రాన్‌, ఉమర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘అర్వింద్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి’

నందిపేట: ఎంపీ ధర్మపురి అర్వింద్‌ వెంటనే రాజీనామా చేయాలని టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నక్కల భూమేష్‌ డిమాండ్‌ చేశారు. ఆది వారం నందిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌, మజారుద్దీన్‌ తదితరులు మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పసుపుబోర్డును ఏర్పాటు చేయని ఎంపీ అర్వింద్‌ పదవిలో కొనసాగవద్దని తెలిపారు. సమావేశంలో మండల కోఆప్షన్‌సభ్యుడు సయ్యాద్‌ హుస్సెన్‌, ఉపసర్పంచ్‌ దాసరి రాంచందర్‌, పాల గంగాధర్‌, ఎర్రం ముత్యం, సాంబారు తిరుపతి, మురళి, పట్టణ అధ్యక్షుడు కనూరి సాగర్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-01-25T05:27:57+05:30 IST