మోదీ, యోగి దిష్టిబొమ్మల దహనం

ABN , First Publish Date - 2021-10-19T05:10:21+05:30 IST

లఖీంపూర్‌ కేరి రైతుల మరణానికి కారణ మైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దిష్టి బొమ్మను దహనం చేశారు.

మోదీ, యోగి దిష్టిబొమ్మల దహనం
నారాయణపేటలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న సీపీఎం నాయకులు

నారాయణపేట, అక్టోబరు 18: లఖీంపూర్‌ కేరి రైతుల మరణానికి కారణ మైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని  సోమవారం సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దిష్టి బొమ్మను దహనం చేశారు. రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని మోదీ ప్రభుత్వం నిరంకు శంగా వ్యవహారిస్తుందని వారు ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం, అనుబంధ సంఘాల నాయకులు వెంకట్రామ్‌రెడ్డి, గోపాల్‌, అంజిలయ్య గౌడ్‌, బాల్‌ రామ్‌, జోషి, రామకృష్ణ, శివ, నరహారి, అశోక్‌, సాయిబాబా పాల్గొన్నారు.

రైతు సంఘం ఆధ్వర్యంలో..

నారాయణపేట టౌన్‌ : ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లభీంపూర్‌  కేరి సంఘటనకు నిరసనగా దామరగిద్ద మండలం ముస్తాపేట్‌లో సోమవారం రైతు సంఘం మండల నాయకులు ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ, యోగి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం, కేవీపీఎస్‌, డీవైఎఫ్‌ఐ నాయకుడు అంజిలయ్య మాట్లాడుతూ రైతులు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నిరసన ర్యాలీ తీస్తుంటే విచక్షణ రహితంగా కేంద్ర మంత్రి కుమారుడు అసీస్‌ మిశ్రా తన వాహనాన్ని రైతుల మీదకు ఎక్కించి నలు గురు రైతులు, ఒక జర్నలిస్టు మృతికి కారణం అయ్యాడన్నారు. దేశానికి స్వాతంత్యం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీయ మార్గంలో శాంతియు తంగా రైతులు ఉద్యమం చేస్తుంటే దాన్ని విచ్చిన్నం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు, నాయకులు వారి అనుచరులతో ఉద్యమ శిబిరాలపై దాడులు చేయడం ప్రజాస్వాయ్య విలువలకు విరుద్దమన్నారు. ఈ ఘటనకు బాధ్య త వహించి కేంద్ర మంత్రి పదవికి అజయ్‌ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లాలప్ప, నాయకులు భీంషేన్‌గౌడ్‌, లాలప్ప, గోవిందు, రాజు, కాశప్ప, సిద్దప్ప పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T05:10:21+05:30 IST