షార్ట్‌ సర్క్యూట్‌తో అరటితోట దగ్ధం

ABN , First Publish Date - 2021-04-13T06:14:33+05:30 IST

మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో రైతు చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన ఆరెకరాల అరటి తోట సోమవారం సాయంత్రం దగ్ధమైంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో అరటితోట దగ్ధం
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

రాప్తాడు, ఏప్రిల్‌ 12: మండలంలోని బుక్కచెర్ల గ్రామంలో రైతు చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన ఆరెకరాల అరటి తోట సోమవారం సాయంత్రం దగ్ధమైంది. పొలంలోని ట్రాన్సఫ్రార్మర్‌ షార్ట్‌సర్యూట్‌ కావడం వలన ప్రమాదవశాత్తు అరటి తోట దగ్ధమైందని ఉద్యానశాఖ సిబ్బంది తెలిపారు. అరటి తోట కాలిపోవడం గమనించిన రైతులు వెంటనే ఫైర్‌ వాహనానికి ఫోన చేశారు. వెంటనే ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పారు. అరటి తోట కాలిపోవడంతో దాదాపు రూ.5 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన చెందారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. ఉద్యానశాఖ సిబ్బంది అరటితోటను పరిశీలించారు. 


Updated Date - 2021-04-13T06:14:33+05:30 IST