దూసుకొస్తున్న బురేవి తుఫాన్‌

ABN , First Publish Date - 2020-12-03T09:15:47+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘బురేవి’ తుఫాన్‌గా మారింది. బుధవారం సాయంత్రం ఇది ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఈశాన్యంగా

దూసుకొస్తున్న బురేవి తుఫాన్‌

విశాఖపట్నం, అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘బురేవి’ తుఫాన్‌గా మారింది. బుధవారం సాయంత్రం ఇది ట్రింకోమలై(శ్రీలంక)కు తూర్పు ఈశాన్యంగా 70 కిలోమీటర్లు, పాంబన్‌(తమిళనాడు)కు తూర్పు ఆగ్నేయంగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.


ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బుధవారం రాత్రికి ట్రింకోమలై వద్ద తీరం దాటి, అనంతరం మన్నార్‌ గల్ఫ్‌, కొమెరిన్‌ ప్రాంతాల్లోకి ప్రవేశించనుంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున తమిళనాడులోని పాంబన్‌-కన్యాకుమారి మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ(భారత వాతావరణ శాఖ) తెలిపింది.  గురు, శుక్రవారాల్లో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మలయా ద్వీపకల్పంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనున్నదని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2020-12-03T09:15:47+05:30 IST