Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 30 Mar 2022 20:59:28 IST

విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం: లంకా దినకర్

twitter-iconwatsapp-iconfb-icon
విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం: లంకా దినకర్

అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం మోపారని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. పీపీఏలు రద్దు చేస్తే ఏపీలో పవర్ ఛార్జీలు తగ్గుతాయన్న జగన్..తన మాట రివర్స్ అని ఇప్పుడు నిరూపించారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పవర్ ఛార్జీల దెబ్బకు జగన్ ప్రభుత్వం అబ్బా అనే రీతిలో ప్రజలు పవర్ నుంచి తపించే సమయం ఆసన్నం అయ్యిందన్నారు. 30 యూనిట్లకి కూడా స్లాబ్ పెట్టారు అంటే పేదల పైన బదుడే బాదుడు అనడం కన్నా కుమ్ముడే కుమ్ముడు అనవచ్చని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలకు డబ్బు చెల్లించకుండా రాష్ట్రానికి కంపెనీలు బొగ్గు ఎలా ఇస్తాయని ఆయన ప్రశ్నించారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.