Jun 11 2021 @ 08:23AM

అల్లు అర్జున్‌ సినిమాల‌పై క్లారిటీ

లాక్‌డౌన్ నుంచి షూటింగ్‌ల‌కు ప‌ర్మిష‌న్ రాగానే ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. దీని త‌ర్వాత గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారీ అల్లు వార‌బ్బాయి. బ‌న్నీ చేయ‌బోయే త‌దుప‌రి చిత్రాల గురించి ఆయ‌న స‌న్నిహితుడు, నిర్మాత బ‌న్నీ వాస్ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు. ‘ప్ర‌స్తుతంఓ చేస్తోన్న పుష్ప 1 పూర్తి కాగానే శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అనే సినిమా చేస్తారు. ఇది పూర్తి కాగానే పుష్ప‌2పై ఫోక‌స్ పెడ‌తారు. ఆ త‌ర్వాత మురుగ‌దాస్ సినిమా, బోయ‌పాటి సినిమాలుంటాయి. ఈ రెంటిలో ఏది ముందు సెట్స్‌పైకి వెళుతుంద‌నేది అప్ప‌టి ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని ఉంటాయి. ఆ త‌ర్వాతే కొర‌టాల శివ‌తో సినిమా ఉంటుంది’ అని క్లారిటీ ఇచ్చారు బన్నీ వాస్. ఈ లెక్కలో బన్నీ అగ్ర దర్శకులందరితో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారని అర్థమవుతుంది.