Jul 23 2021 @ 11:49AM

'గని' సెట్‌లో బన్నీ

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని' ఈ మూవీ సెట్‌లో బన్నీ ప్రత్యక్షమై చిత్ర బృందానికి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. యంగ్ డైరెక్టర్ కొరణ్ కొర్రపాటి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. రినైసెన్స్ పిక్చర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి.. మొదటి సినిమాగా 'గని' నిర్మిస్తున్నారు. బ్యాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతుండగా, కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్‌తో ఆగిపోయిన చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమై శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు వెంకటేశ్ సోదరుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'గని' షూటింగ్ స్పాట్‌లో మెరిశాడు. అన్న నిర్మాత, వరుణ్ తేజ్ హీరోకాబట్టి ఇద్దరు తనవాళ్ళే కాబట్టి విష్ చేయాలని ప్రత్యేకంగా సెట్‌కి వచ్చారట. 'గని' సినిమా త్వరగా కంప్లీట్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ సాధిచాలని కోరుతూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపాడట బన్నీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.