నెంబర్ 1 చోర్ కేసీఆర్: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-04-17T00:25:34+05:30 IST

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి రెండోవిడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

నెంబర్ 1 చోర్ కేసీఆర్: బండి సంజయ్

హైదరాబాద్: క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి రెండోవిడత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం  ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒంటెద్దు పోకడతో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించకుండా వరి వేయొద్దంటే ఎలా? అని ప్రశ్నించారు.కేసీఆర్ సర్కార్ దగ్గర సరైన ప్రణాళిక లేదన్నారు. ధాన్యం ఇవ్వబోమని కేసీఆర్‌ కేంద్రంతో చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసింది ఆయనే.. మళ్లి పెట్టింది ఆయనేనని చెప్పారు. నెంబర్ 1 చోర్ కేసీఆర్ అన్నారు.

టీఆర్‌ఎస్‌ ఢిల్లీ ధర్నాలో రైతులు పాల్గొనలేదన్నారు. రైతులకు అర్థమైంది ధాన్యం కొనేది కేంద్రమే అని.. తానే ధాన్యం కొంటున్నట్లు కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం కొనాలని నిర్ణయించుకున్న కేసీఆర్.. కేంద్రానికి ఎందుకు లేఖ రాసినట్లో? చెప్పాలని ప్రశ్నించారు.కరెంట్ చార్జీల పెంపుపై ప్రజలు మండిపడుతున్నారన్నారు.2023లో టీఆర్‌ఎస్‌ గెలవదని కేసీఆర్‌కు అర్థమైందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. 610 జీవో కారణంగా కేంద్రాన్ని ఏడేళ్లుగా తిడుతూనే ఉన్నారని మండిపడ్డారు. ఫాంహౌస్, ప్రగతి భవన్ లో  కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని చెప్పారు. ఖమ్మంలో చనిపోయిన బీజేపీ నేత సాయి మీద స్థానిక మంత్రుల ఆదేశాల మేరకు రౌడీ షీట్ ఓపెన్ చేశారన్నారు.సాయి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు.. సాయి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది అని బండి సంజయ్ తెలిపారు.




Updated Date - 2022-04-17T00:25:34+05:30 IST