Abn logo
Sep 25 2021 @ 00:14AM

27న భారత్‌ బంద్‌ను విజయవంతం చేద్దాం

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తున్న ప్రజాసంఘాల నాయకులు

గుంటూరు, సెప్టెంబరు 24: కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేద్దామని ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు శుక్రవారం లాడ్జి సెంటరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆయా సంఘాల నేతలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా బంద్‌కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో  పీకేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కొండారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా కార్యద్శర్శి డి.సుధాకర్‌, నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.యోహాన్‌, ఎం.పోతురాజు, కేఎన్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బి.విజయభాస్కరరావు, ఉపాధ్యక్షుడు విల్సన్‌బాబు పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.