చివరి టెస్టుకు బుమ్రా దూరం

ABN , First Publish Date - 2021-02-28T09:25:50+05:30 IST

ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో భారత పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా ఆడడం లేదు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచాలని బుమ్రా బీసీసీఐని కోరాడు...

చివరి టెస్టుకు బుమ్రా దూరం

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టులో భారత పేసర్‌ జస్ర్పీత్‌ బుమ్రా ఆడడం లేదు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంచాలని బుమ్రా బీసీసీఐని కోరాడు. దీంతో బుమ్రా కోరికను మన్నించినట్టు బోర్డు కార్యదర్శి జై షా తెలిపాడు. అయితే బుమ్రా స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. చివరి టెస్టు మార్చి 4 నుంచి నరేంద్ర మోదీ మైదానంలోనే జరగనుంది. గులాబీ టెస్టులో మొత్తం స్పిన్నర్లే రాజ్యమేలడంతో బుమ్రాకు పెద్దగా బౌలింగ్‌ చేసే అవకాశం రాలేదు. చివరి టెస్టు కూడా అక్కడే కాబట్టి అతడి లోటు కనిపించకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీ్‌సకు కూడా ఈ స్పీడ్‌స్టర్‌కు విశ్రాంతినిచ్చారు. 

ఇంగ్లండ్‌కు పేసర్‌ వోక్స్‌: ఆటగాళ్ల రొటేషన్‌ పాలసీలో భాగంగా ఇంగ్లండ్‌ పేసర్‌ క్రిస్‌ వోక్స్‌ స్వదేశానికి వెళ్లాడు. 31 ఏళ్ల ఈ పేసర్‌ దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్‌లతో సిరీ్‌సకు ఎంపికైనా తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. 


Updated Date - 2021-02-28T09:25:50+05:30 IST