Advertisement
Advertisement
Abn logo
Advertisement

బంపర్‌ ఆఫర్లు

ఐఐటీ విద్యార్థులకు బంపర్‌ ఆఫర్లు

ఐఐటీ రూర్కీ విద్యార్థికి రూ.2.15 కోట్ల వార్షిక ప్యాకేజీ 

ఐఐటీ బాంబే విద్యార్థికి రూ.2.05 కోట్ల ఆఫర్‌ 


న్యూఢిల్లీ: దేశంలోని పలు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్లేస్‌మెంట్ల సందడి మొదలైంది. అనేక మంది విద్యార్థులకు కంపెనీలు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఐఐటీ రూర్కీ విద్యార్థి ఒకరు ఏకంగా రూ.2.15 కోట్ల వార్షిక ప్యాకేజీని ఓ అంతర్జాతీయ టెక్‌ సంస్థ నుంచి పొందడం విశేషం. ఐఐటీ బాంబే విద్యార్థి ఒకరికి 2.74 లక్షల డాలర్ల వార్షిక ప్యాకేజీ (సుమారు రూ.2.05 కోట్లు)ని ఉబర్‌ ఆఫర్‌ చేసింది. ఐఐటీ గువహతి విద్యార్థికి రూ.2 కోట్ల వార్షిక ప్యాకేజీ లభించింది.


ఐఐటీ (బీహెచ్‌యూ) వారణసికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉబర్‌లో ఉద్యోగాలు పొందారు. వీరిలో ఒకర విద్యార్థి సంస్థకు చెందిన అమెరికా కార్యాలయంలో పని చేయడానికి అవకాశాన్ని పొందడం విశేషం. మరో విద్యార్థి రూ.2 కోట్ల ప్యాకేజీని పొందారు. ఐఐటీ బీహెచ్‌యూ విద్యార్థులకు 55 కంపెనీలు 232 ఆఫర్‌ లెటర్లు ఇచ్చాయి. ఈ కంపెనీల సగటు వార్షిక ప్యాకేజీ రూ.32.89 లక్షలుండగా.. కనీస మొత్తం రూ.12 లక్షలుగా ఉంది. ఐఐటీ ఢిల్లీలో తొలి రోజు 60 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా వార్షిక ప్యాకేజీలను అందుకున్నారు. 

ఐఐటీ బాంబేAdvertisement
Advertisement