Abn logo
Sep 19 2021 @ 00:25AM

రాష్ట్రంలో రౌడీరాజ్యం: టీడీపీ

ధర్మవరం, సెప్టెంబరు 18: రాష్ట్రంలో రౌడీరాజ్యం సాగుతోందని మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ కమతం కా టమయ్య, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజినేయులు, పా ర్లమెంట్‌ అధికార ప్రతినిధి పురుషోత్తంగౌడ్‌లు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇంటిపై దాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్యన్నారు. జెడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై రౌడీఎమ్మెల్యే జోగి రమేశ్‌ అనుచరులై వందలాదిమందితో రాళ్లతో దాడులు నిర్వహించి అనంతరం టీడీపీ శ్రేణులపై కూడా కర్రలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచారన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రం లో రౌడీపాలన సాగుతోందని అర్థమవుతోందన్నారు. పార్టీనేత అయన్న పాత్రుడు చేసిన నేరమేమీలేదని, కసుపుపై కాసులు ఏరుకుంటున్న సీఎం అని ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిలదీశారన్నారు. ఇందులో తప్పేముందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలుచుకునిఉంటే నాడు జగన్‌ పాదయాత్ర చేసిఉండేవారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి  వచ్చిప్పటి నుండి ఏదో రకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయడం, అక్రమకేసులు బనాయించడం జరుగుతోందన్నారు. ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాచర్లకంచన్న, చింతపులుసు పెద్దన్న, పరిశేసుధాకర్‌, క్రిష్ణాపురం జమీర్‌ అహమ్మద్‌, బీమ నేని ప్రసాద్‌నాయుడు, రుద్రారవి, గరుగువెంగప్ప, రాంపురం శీన, పఠాన్‌ బాబూఖాన్‌, డిష్‌ లచ్చి, కత్తుల బాబ్జీ, కిరోసిన్‌ పోతలయ్య, రాళ్లపల్లి షరీఫ్‌, పోతుకుంట రమేశ్‌, టైలర్‌ కుళ్లా యప్ప, మారుతీస్వామి, షపీ, మాబు,హస్సేన్‌, అశోక్‌, వెంకీ, నారాయణస్వామి, శివరాం, బత్తలగంగాధర్‌, చింతమేకల శ్రీనివాసులు, మహిళా నాయకురాలు సాహెబ్బీ తదితరులు పాల్గొన్నారు.

కదిరి: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంపై ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం పట్టణంలో హిందూపురం పార్లమెంట్‌ తెలుగుయువత అధ్యక్షుడు బాబ్‌జాన్‌, కాటం మ నోజ్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోంద న్నారు. జడ్‌ప్లస్‌ కేటగిరి ఉన్న మాజీ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి పై అధికార పార్టీ ఎమ్మెల్యే , అతని అనుచరులు దాడి చేశారంటే ఆ పార్టీ నాయకులు దౌర్జన్యాలు ఏవిధంగా ఉన్నాయో స్పష్టం అవుతోందన్నారు.  ఇప్పటికైనా ఎమ్మెల్యే జోగిరమేష్‌ శాసన సభత్వాన్ని రద్దు చేసి, అతను, అతని అనుచరులపై చట్టపరంగా చర్యలు చేపట్టాల ని, లేని పక్షంలో దశల వారిగా ఆందోళన కార్యక్రమాలు ఉదృ తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు శివ, మల్లిరెడ్డి, హైదర్‌ పాల్గొన్నారు.