సీనియర్స్‌ విభాగంలో కానూరు ఎడ్ల సత్తా

ABN , First Publish Date - 2021-01-14T07:01:13+05:30 IST

కానూరు వీఆర్‌ సిద్ధార్థ కళాశాల మైదానంలో రైతు సంబరాల పేరిట యార్లగడ్డ వెంక య్య మెమోరియల్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎడ్ల పోటీలు బుధవారంతో ముగిశాయి. సీనియర్స్‌ విభాగంలో కానూరు మాజీ సర్పంచ్‌ దేవభక్తుని సుబ్బారావుకు చెందిన ఎడ్లజత 2471 అడుగుల దూరం ప్రథమ స్థానంలో నిలిచి రూ.7 లక్షలు విలువ గల కారును సొంతం చేసుకున్నాయి.

సీనియర్స్‌ విభాగంలో కానూరు ఎడ్ల సత్తా

పెనమలూరు, జనవరి 13:  కానూరు వీఆర్‌ సిద్ధార్థ కళాశాల మైదానంలో రైతు సంబరాల పేరిట యార్లగడ్డ వెంక య్య మెమోరియల్‌ ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎడ్ల పోటీలు బుధవారంతో ముగిశాయి. సీనియర్స్‌ విభాగంలో కానూరు మాజీ సర్పంచ్‌ దేవభక్తుని సుబ్బారావుకు చెందిన ఎడ్లజత 2471 అడుగుల దూరం  ప్రథమ స్థానంలో నిలిచి రూ.7 లక్షలు విలువ గల కారును సొంతం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా నెల్లూరు రామకోటయ్యకు చెందిన ఎడ్ల జత ద్వితీయ స్థానంలో నిలిచి రూ. 2.5 లక్షలు విలువ గల బుల్లెట్‌ బైక్‌ను సొంతం చేసుకున్నాయి. గన్నవరానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు ఎడ్ల జత తృతీయ స్థానంలో నిలిచి రూ.లక్ష నగదును గెలుపొందాయి. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి  బహుమతులను ప్రదానం చేశారు. నిర్వాహకుడు యార్లగడ్డ వెంకట్రావు, పశు పోషకులు, రైతు సోదరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-14T07:01:13+05:30 IST