(జనవరి 24-28 తేదీల మధ్య వారానికి)
గత వారం నిఫ్టీ : 17617 (-639)
నిఫ్టీ గత వారం 18351-17486 పాయింట్ల మధ్యన కదలాడి 639 పాయింట్ల నష్టంతో 17617 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17925 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలినికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17533, 17510, 17094, 16576 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 18600, బ్రేక్‌డౌన్ స్థాయి : 17950,
నిరోధ స్థాయిలు: 17775, 17850, 17925 (17700 పైన బుల్లిష్), మద్దతు స్థాయిలు: 17475, 17400, 17325 (17550 దిగువన బేరిష్)