బులియన్‌ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-27T06:56:20+05:30 IST

బులియన్‌ వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌ బులియన్‌ గోల్డ్‌ సిల్వర్‌ అండ్‌ డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌ అన్నారు.

బులియన్‌ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి
ఆంధ్రప్రదేశ్‌ బులియన్‌ గోల్డ్‌ సిల్వర్‌ అండ్‌ డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న నూతన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌

  రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 26 : బులియన్‌ వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నూతనంగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్‌ బులియన్‌ గోల్డ్‌ సిల్వర్‌ అండ్‌ డైమండ్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం గోల్డ్‌ కన్వెన్షన్‌ హాలులో ఆదివారం జరిగిన రాష్ట్ర సంఘ ఎన్నికల్లో అధ్యక్షుడిగా కపిలవాయి విజయకుమార్‌ (చిలకలూరిపేట), చీఫ్‌ ఆర్గనైజర్‌గా శాంతిలాల్‌ జైన్‌ (నెల్లూరు), ప్రధాన కార్యదర్శిగా బొమ్మిడిశెట్టి శంకరరావు (అమలాపురం), కోశాధికారిగా అనిల్‌ జైన్‌ (అమలాపురం), ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా మద్దుల గిరీష్‌ (మచిలీపట్నం), జయం విశ్వనాథ్‌ (రాయదుర్గం), బుర్రా మల్లేశ్వరరావు (విజయవాడ) ఎన్నికయ్యారు. 26 జిల్లాల నుంచి వేలాది బులియన్‌ మర్చంట్లు హాజరైన ఈ సభలో కపిలవాయి విజయకుమార్‌ మాట్లాడుతూ, వ్యాపారులపై ప్రభుత్వం పన్నులు ఎక్కువగా విధిస్తోందన్నారు. కరోనా అనంతరం వ్యాపారాలు తగ్గిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో మద్దుల గిరీష్‌, ఉడత్తు కిషోర్‌, పరిమి శేషగిరి, యర్రా శ్రీనివాస్‌, వాకమల్లు చిట్టిబాబు, తాడంకి ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.

Updated Date - 2022-06-27T06:56:20+05:30 IST