పోలీసు కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేసిన ‘Bulli Bai App’ క్రియేటర్

ABN , First Publish Date - 2022-01-09T15:06:10+05:30 IST

భోపాల్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నీరజ్ బిష్ణోయ్ (21).. మయాంక్ రావల్ (21), శ్వేతా సింగ్, విశాల్ కుమార్ ఝా అనే ముగ్గురు బుల్లి యాక్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా అరెస్టై పోలీసుల కస్టడీలో ఉన్నారు..

పోలీసు కస్టడీలో ఆత్మహత్యాయత్నం చేసిన ‘Bulli Bai App’ క్రియేటర్

న్యూఢిల్లీ: ‘బుల్లి బాయ్ యాప్’.. ముస్లిం మహిళల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెడుతున్న ఈ యప్ క్రియేటర్ నీరజ్ బిష్ణోయ్ తాగాజా ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైట్ వింగ్ భావజాలానికి చెందిన ఇతడు ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే తమ కస్టడీలోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఇంటలీజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ స్పెషల్ సెల్ డీసీపీ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు.


భోపాల్‌లోని ఓ ఇనిస్టిట్యూట్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నీరజ్ బిష్ణోయ్ (21).. మయాంక్ రావల్ (21), శ్వేతా సింగ్, విశాల్ కుమార్ ఝా అనే ముగ్గురు బుల్లి యాక్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా అరెస్టై పోలీసుల కస్టడీలో ఉన్నారు. బుల్లి బాయ్‌ యాప్‌కు అనుబంధంగా ‘సుల్లీ డీల్స్’ అనే వేలాన్ని కూడా నిర్వహించారు. ఈ రెండింటిలో ముస్లిం మహిళలను ఆన్‌లైన్ వేలం పెడుతూ మత విధ్వేషాలకు పాల్పడుతున్నారు.


కాగా, నీరజ్‌కు హ్యాకింగ్‌తో పాటు వెబ్‌సైట్లను ధ్వంసం చేయడం ఒక అలవాటుగా ఉందని, 15వ ఏట నుంచే ఇలాంటి వాటిపై అతడు శిక్షణ పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇండియాతో పాటు పాకిస్తాన్‌లోని వివిధ పాఠశాలల వెబ్‌సైట్లను హ్యాక్ చేసి, అందులో కొన్నింటిని ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఇక తాజా ‘బుల్లి బాయ్ యాప్‌’లో కూడా దేవనాగరి స్క్రిప్ట్, గుర్ముఖి స్క్రిప్ట్‌లను ఉపయోగించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-01-09T15:06:10+05:30 IST