Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా?.. హైదరాబాద్‌కు అర్హత లేదా?: కేటీఆర్‌

హైదరాబాద్‌: బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా?..హైదరాబాద్‌కు అర్హత లేదా? అని మంత్రి కేటీఆర్‌, కేంద్రాన్ని ప్రశ్నించారు. సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరంగల్‌ రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామని, అయినా కోచ్‌ ఫ్యాక్టరీ రాలేదని తెలిపారు. ఐటీఐఆర్‌ కారిడార్‌ను రద్దు చేసి తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు. కేంద్రం హామీలిచ్చి నెరవేర్చకపోతే ఎవర్ని అడగాలని కేటీఆర్‌ ప్రశ్నించారు. మేకిన్‌ ఇండియా అంటున్న కేంద్రం.. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ ఇవ్వలేదని తప్పుబట్టారు. దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్‌ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కాకుండా ప్రజల కోసం.. దేశం కోసం పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు.

Advertisement
Advertisement