బుల్లెట్‌ కాఫీ... ఇప్పుడిదే క్రేజ్‌

ABN , First Publish Date - 2022-08-07T20:34:51+05:30 IST

పొద్దున్నే బెడ్‌ మీద నుంచి నిద్రలేచిన డీజే టిల్లు ‘మమ్మీ.. బుల్లెట్‌ కాఫీ’ అనడుగుతాడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఆ మధ్య ‘ఘీ’ కాఫీ గురించి పేర్కొంది. ఇటీవలే భూమిపడ్నేకర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బుల్లెట్‌కాఫీ గురించి ఒక పోస్టు పె

బుల్లెట్‌ కాఫీ... ఇప్పుడిదే క్రేజ్‌

పొద్దున్నే బెడ్‌ మీద నుంచి నిద్రలేచిన డీజే టిల్లు ‘మమ్మీ.. బుల్లెట్‌ కాఫీ’ అనడుగుతాడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కూడా ఆ మధ్య ‘ఘీ’ కాఫీ గురించి పేర్కొంది. ఇటీవలే భూమిపడ్నేకర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో బుల్లెట్‌కాఫీ గురించి ఒక పోస్టు పెట్టింది. ఇక.. సామాజిక మాధ్యమాల్లో అయితే చెప్పక్కర్లేదు. అందరూ ఈ రకం కాఫీలను తాగుతూ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. ఇంతకూ ఏంటీ బుల్లెట్‌ కాఫీ? 


  • మహిళల్లో వయసు పెరుగుతున్న కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఘీ కాఫీ తాగితే హార్మోన్ల సమతుల్యత పెరిగి, ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. 
  • ఏం లేదు. చాలా సింపుల్‌. రోజూ మనం కాఫీ తాగుతాం కదా! అందులోకి రెండు స్పూన్ల శ్రేష్ఠమైన నెయ్యి లేదా బటర్‌ వేసుకుని తాగితే, అదే బుల్లెట్‌ కాఫీ. దీన్నే కొందరు ‘ఘీ కాఫీ’, ‘కీటో కాఫీ’ అంటున్నారు. 
  • కాఫీలోని లాక్టోజ్‌ కొందరికి పడదు. ఇరిటేషన్‌ కలిగిస్తుంది. అయితే కాఫీలోకి నెయ్యి వేసుకోవడం వల్ల లాక్టోజ్‌ వల్ల కలిగే ఇబ్బందులు తొలగుతాయి.  
  • ఉదయాన్నే కాఫీలోకి నెయ్యి వేసుకుని తాగడం వల్ల .. తిన్న ఆహారం మెల్లగా జీర్ణమై ఇన్సులిన్‌ కూడా నెమ్మదిగా విడుదల అవుతుందట. జీర్ణప్రక్రియ చురుగ్గా లేని వాళ్లకు ఘీ కాఫీ ఎంతో మేలు చేస్తుంది.
  • నెయ్యిలో మంచి కొవ్వులు ఉంటాయి. పరగడుపునే కాఫీతో పాటు తీసుకుంటాం కాబట్టి.. బరువు తగ్గడానికి దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను తొలగించడానికి కాఫీలోని నెయ్యి ఉపకరిస్తుంది.
  • తక్షణ శక్తికి బుల్లెట్‌ కాఫీ ఉపకరిస్తుంది. నెయ్యిలోని కొవ్వులు, ప్రొటీన్లు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఫలితంగా ఉదయాన్నే చురుగ్గా మారతాం. జీవక్రియలు సైతం చురుకవుతాయి. 
  • బుల్లెట్‌ కాఫీ తాగే వాళ్లు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. దీనిపైన శాస్త్రీయ పరిశోధనలు జరగాల్సి ఉంది. న్యూట్రీషనిస్టులు, డైటీషియన్ల సలహాలు తీసుకుని తాగాలి. 
  • కాఫీలోకి కాస్త నెయ్యి లేదా బటర్‌ వేసుకోవడం వల్ల.. కెఫిన్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. కాఫీ లేదా కెఫిన్‌ వంటివి కొందరిలో చికాకు కలిగించి, ఆందోళనకు గురిచేస్తాయి. వేడి కాఫీలోకి రెండు చుక్కల నెయ్యి వేసుకుని తాగడం వల్ల సమస్య తీవ్రత తగ్గే అవకాశం ఉంది. నెయ్యిలోని కొవ్వులు శాంత పరుస్తాయి.



Updated Date - 2022-08-07T20:34:51+05:30 IST