Shaheen Bagh లో Bulldozers.. స్థానికుల నిరసన

ABN , First Publish Date - 2022-05-09T18:27:14+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న Shaheen Bagh ప్రాంతంలో ఆక్రమణలు కూల్చేందుకు South Delhi Municipal Corporation సిద్ధమైంది. షహీన్‌ బాఘ్‌లోని కలింది కుంజ్, జామియా నగర్ ప్రాంతాల్లోకి ఉయదమే Bulldozers వచ్చాయి. షహీన్‌ బాఘ్‌లోని జీ బ్లాక్ నుంచి జసోలా

Shaheen Bagh లో Bulldozers.. స్థానికుల నిరసన

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న Shaheen Bagh ప్రాంతంలో ఆక్రమణలు కూల్చేందుకు South Delhi Municipal Corporation సిద్ధమైంది. షహీన్‌ బాఘ్‌లోని కలింది కుంజ్, జామియా నగర్ ప్రాంతాల్లోకి ఉదయమే Bulldozers వచ్చాయి. షహీన్‌ బాఘ్‌లోని జీ బ్లాక్ నుంచి జసోలా వరకు జసోలా నాలే నుంచి కలింది కుంజ్ పార్క్ వరకు బుల్డోజర్లు మోహరించాయి. ఘర్షణ వాతావరణం నెలకొనకుండా అదుపు చేసేందుకు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. వాస్తవానికి ఢిల్లీ పోలీసులను ఎస్‌డీఎంసీనే మోహరించింది. కాగా, ఎస్‌డీఎంసీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసనకు దిగారు.


ఆక్రమణలను తొలగించే కార్యక్రమం మే 5నే ప్రారంభించాల్సి ఉండగా.. పోలీసులు అందుబాటులో లేకపోవడం వల్ల సోమవారానికి వాయిదా వేసినట్లు ఎస్‌డీఎంసీ చెందిన ఒక అధికారి తెలిపారు. ‘‘ఎస్‌ఎండీసీ బృందం ఉదయం 11 గంటలకు షాహీన్ బాగ్‌లో ఆక్రమణల నిరోధక డ్రైవ్‌ను నిర్వహించడానికి వచ్చింది. కూల్చివేత డ్రైవ్‌లో పోలీసు బలగాలు మాకు సహాయంగా ఉంటాయి. ఈ విషయమై పోలీసు అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటాము’’ అని ఆ అధికారి పేర్కొన్నారు.


కాగా, బుల్డోజర్లకు ఎదురుగా బైఠాయించి స్థానికులు నిరసన చేస్తున్నారు. ఇందులో స్థానిక నాయకులు కూడా ఉన్నారు. ఎస్‌ఎండీసీ వెంటనే బుల్డోజర్లను వెనక్కి పిలవాలని, కూల్చివేతలు జరక్కుండా నిరోధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై నిరసనలో పాల్గొన్న ఒక నాయకుడు మాట్లాడుతూ ‘‘బుల్డోజర్లతో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేతలు జరగనివ్వం’’ అని అన్నారు. మరొక నేత మాట్లాడుతూ ‘‘15 ఏళ్లుగా బీజేపీనే మున్సిపాలిటీలో అధికారంలో ఉంది. ఉన్నపళంగా ఏమైందో తెలీడం లేదు’’ అని అన్నారు.

Read more