జిల్లాస్థాయి ఎడ్ల బండ్ల పోటీల విజేత చోడవరం

ABN , First Publish Date - 2021-01-16T05:41:29+05:30 IST

రైతు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గురువారం జిల్లాస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు.

జిల్లాస్థాయి ఎడ్ల బండ్ల పోటీల విజేత చోడవరం
ఎడ్ల బండ్ల పోటీ

మునగపాక, జనవరి 15 : రైతు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా గురువారం జిల్లాస్థాయి ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించారు. చోడవరం మండలం సింహాద్రిపురానికి  చెందిన సబ్బవరపు వెంకటరమణ  ప్రథమ,   వల్లంపూడికి చెందిన ఏడువాక సత్తిబాబు ద్వితీయ స్థానాల్లో నిలవడంతో నగదు బహుమతి అందజేశారు. మరిన్ని స్థానాల్లో మరికొందరు నిలిచారు. తొలుత ఈ పోటీలను ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, డైట్‌ కళాశాల కరస్పాండెంట్‌ దాడి రత్నాకర్‌, జనసేన పార్టీ నాయకులు సుందరపు విజయ్‌కుమార్‌ ప్రారంభించారు.  అనంతరం సుందరపుసేన ఆధ్వర్యంలో గుర్రాల ప్రదర్శన నిర్వహించారు.  

Updated Date - 2021-01-16T05:41:29+05:30 IST