బుల్‌ జోష్‌!

ABN , First Publish Date - 2022-07-29T08:45:14+05:30 IST

దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ చిందులేసింది. గురు వారం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్లలో ఇన్వెసర్లు జోరుగా కొనుగోళ్లు చేపట్టడంతో ఈ నెల ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల ముగింపు రోజున ప్రామాణిక ఈక్విటీ సూచీలు 3 నెలల గరిష్ఠ స్థాయికి ఎగిశాయి.

బుల్‌ జోష్‌!

3 నెలల గరిష్ఠానికి సూచీలు

సెన్సెక్స్‌ 1,041 పాయింట్లు అప్‌

17,000 స్థాయికిచేరువలో నిఫ్టీ 


ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ చిందులేసింది. గురు వారం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఐటీ షేర్లలో ఇన్వెసర్లు జోరుగా కొనుగోళ్లు చేపట్టడంతో ఈ నెల ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల ముగింపు రోజున ప్రామాణిక ఈక్విటీ సూచీలు 3 నెలల గరిష్ఠ స్థాయికి ఎగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 57,000, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17,000 మైలురాయికి చేరువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, రూపాయి బలోపేతం వంటి అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. దీంతో సెన్సెక్స్‌ 1,041.47 పాయింట్ల (1.87ు) లాభంతో 56,857.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 287.80 పాయింట్లు (1.73ు) బలపడి 16,929.60 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 25 లాభాల్లో పయనించాయి. బజాజ్‌ ఫైనాన్స్‌ 10.68ు, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 10.14ు లాభంతో సూచీ టాప్‌ గెయినర్లుగా నిలిచాయి. టాటా స్టీల్‌, కోటక్‌ బ్యాంక్‌ 4 శాతానికి పైగా పుంజుకోగా.. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, నెస్లే షేర్లు 3 శాతానికి పైగా పెరిగాయి. ఎయిర్‌టెల్‌, అలా్ట్రటెక్‌ సిమెంట్‌ మాత్రం ఒక శాతానికి పైగా నష్టపోయాయి. బ్లూచి్‌పలతోపాటు ఈ మధ్య కాలంలో ధర భారీగా తగ్గిన చిన్న,మధ్య స్థాయి కంపెనీల షేర్లలోనూ మదుపర్లు కొనుగోళ్లు జరిపారు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ సూచీ 0.94ు, స్మాల్‌క్యాప్‌ 0.65ు పెరిగాయి. బీఎ్‌సఈలోని టెలికాం మినహా మిగతా రంగ సూచీలన్నీ లాభాల్లో క్లోజయ్యాయి. 


ర్యాలీకి తోడ్పడిన అంశాలివే..

యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ 

40 ఏళ్ల గరిష్ఠానికి చేరిన ధరలకు కళ్లెం వేసేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఈసారి వడ్డీ రేట్లను 1 శాతం పెంచవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును అంచనాల కంటే తక్కువగా, గతసారి స్థాయిలోనే 0.75 శాతానికి పరిమితం చేసింది. అంతేకాదు, మరోమారు ముప్పావు పెంపు తర్వాత వడ్డింపు తీవ్రతను క్రమంగా తగ్గించనున్నట్లు ఫెడ్‌ సంకేతాలిచ్చింది. అలాగే, మున్ముందు ఉపాధి కల్పనపైనా ఫెడ్‌ ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఆర్థిక మాంద్యం భయాలను తోసిపుచ్చడం అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. 


22 పైసలు పెరిగిన రూపాయి 

డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు బలపడింది. దాంతో డాలర్‌-రూపాయి ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.79.69కు పరిమితమైంది. ఫెడ్‌ రేట్ల పెంపు అంచనాల కంటే తక్కువగా ఉండటం, అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్‌ తగ్గడం రూపీ బలోపేతానికి తోడ్పడింది. 


విదేశీ పెట్టుబడుల పునరాగమనం

ఈ ఏడాది జూన్‌ వరకు భారత ఈక్విటీ మార్కెట్లో వరుసగా అమ్మకాలకు పాల్పడుతూ వచ్చిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎ్‌ఫపీఐ) జూలైలో అమ్మకాల తీవ్రతను తగ్గించారు. అడపాదడపా కొనుగోళ్లు జరుపుతున్నారు కూడా. వడ్డింపు తీవ్రతను తగ్గించనున్నట్లు ఫెడ్‌ సంకేతాలివ్వడంతో మున్ముందు నెలల్లో ఎఫ్‌పీఐలు భారత్‌ సహా ఇతర వర్ధమాన మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు పెంచవచ్చన్న అంచనాలూ ట్రేడింగ్‌ ట్రెండ్‌కు సానుకూలంగా పరిణమించాయి. 

Updated Date - 2022-07-29T08:45:14+05:30 IST