కోడెగిత్త ః రూ.3.5 లక్షలు

ABN , First Publish Date - 2021-01-14T06:18:18+05:30 IST

మహా అంటే రూ.లక్ష. లేదంటే రూ.లక్షన్నర పలికే కోడెగిత్త.. ఏకంగా రూ.మూడున్నర లక్షలకు అమ్ముడుపోయింది.

కోడెగిత్త ః రూ.3.5 లక్షలు

తమిళనాడు జల్లికట్టుకు ఆర్సీపురంలో కొనుగోలు 


రామచంద్రాపురం, జనవరి 13: మహా అంటే రూ.లక్ష. లేదంటే రూ.లక్షన్నర పలికే కోడెగిత్త.. ఏకంగా రూ.మూడున్నర లక్షలకు అమ్ముడుపోయింది. బుధవారం అనుప్పల్లెలో జరిగిన జల్లికట్టును చూసేందుకు తమిళనాడు రాష్ట్రం షోలింగర్‌కు చెందిన కొందరు వచ్చారు. ఈ జల్లికట్టులో 300 కోడెగిత్తలు పాల్గొన్నాయి. ఇదే పంచాయతీకి చెందిన రమణారెడ్డి కోడెగిత్త జల్లికట్టులో అందర్ని ఆకర్షించింది. అల్లిలో దీనిని యువకులు నిలవరించలేక పోయారు. దీంతో షోలింగర్‌వాసులు తాము నిర్వహిచే జల్లికట్టుకు ఈ కోడెగిత్తను ఎంపిక చేసుకుని రూ.3.5లక్షలకు కొన్నారు. అడ్వాన్సుగా రూ.51వేలు చెల్లించి మిగిలిన సొమ్ము రెండు రోజుల్లో ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.

Updated Date - 2021-01-14T06:18:18+05:30 IST