సింగరేణిలో బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌

ABN , First Publish Date - 2021-01-14T05:52:48+05:30 IST

సింగరేణిలోని సుమారు 45వేల మంది ఉద్యోగులకు సత్వరమే సమాచారం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ప్రజా సంబంధాలశాఖ వారు సింగరేణి శాప్‌ (ఈఆర్‌పీ) విభాగంతో కలిసి ఇక నుంచి ముఖ్యమైన సమాచారాన్ని సింగరేణిలోని ఉద్యోగులందరికీ ‘ఎస్‌ఎంఎస్‌’ ద్వారా ఒకేసారిగా అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని జనరల్‌ మేనేజర్‌ (కో-ఆర్డినేషన్‌) కే. రవిశంకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సింగరేణిలో బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ సర్వీస్‌

సీఎండీ సంక్రాంతి శుభాకాంక్షలతో ప్రారంభం 

కొత్తగూడెం, జనవరి 13: సింగరేణిలోని సుమారు 45వేల మంది ఉద్యోగులకు సత్వరమే సమాచారం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ప్రజా సంబంధాలశాఖ వారు సింగరేణి శాప్‌ (ఈఆర్‌పీ) విభాగంతో కలిసి ఇక నుంచి ముఖ్యమైన సమాచారాన్ని సింగరేణిలోని ఉద్యోగులందరికీ ‘ఎస్‌ఎంఎస్‌’ ద్వారా ఒకేసారిగా అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని జనరల్‌ మేనేజర్‌ (కో-ఆర్డినేషన్‌) కే. రవిశంకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సంక్రాంతి సందర్భంగా సింగరేణి చైర్మన్‌ అండ్‌ ఎండీ. ఎన్‌. శ్రీధర్‌ విడుదల చేసిన సంక్రాంతి శుభాకాంక్షలను ఈ గ్రూపు ‘ఎస్‌ఎంఎస్‌ సిస్టం ద్వారా సింగరేణిలోని ఉద్యోగులకు చేరవేశారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ సౌకర్యాన్ని కేవలం నెల జీతం సమాచారం ఇవ్వడం కోసం మాత్రమే వినియోగిస్తున్నారని తెలిపారు. ఇకపై సంస్థకు సంబంధించి కార్మికులకు చేరాల్సిన ముఖ్య సమాచారాన్ని సంక్షిప్తంగా పంపించడానికి ఈ గ్రూపు ఎస్‌ఎంఎస్‌ పద్ధతిని వినియోగించుకోవాలని సంస్థ చైర్మన్‌ చేసిన సూచనను సంక్రాంతి నుంచి అమలులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఎస్‌ఎంఎస్‌ సందేశం అందుకోని ఉద్యోగులు వారి ప్రస్తుత సెల్‌నెంబర్‌ను సంబంధిత గని/డిపార్ట్‌మెంట్‌ వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు.


Updated Date - 2021-01-14T05:52:48+05:30 IST