Abn logo
Dec 3 2020 @ 00:44AM

మార్చి నాటికి భవనాలు పూర్తి చేయాలి


తాళ్లూరు, డిసెంబరు 2: ఎన్నార్జీఎస్‌ ద్వారా చేపడుతున్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు మార్చినాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ కె.కొండయ్య తెలిపారు. మండలంలోని తాళ్లూరు, దోసకాయలపాడు గ్రామాల్లో పంచాయతీ రాజ్‌శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సచివాలయ భవననిర్మాణాలను,  రైతు భరోసా కేంద్రాలను, దోసకాయలపాడు-తోటవెంగన్నపాలెం నడుమపూర్తిగా దెబ్బతిన్న దోర్నపువాగు కల్వర్ట్‌ను పరిశీలించారు.    వాగుపై చప్టానిర్మాణానికి ఎంతమేర నిధులుఅవసరమో అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ విఠల్‌రాథోడ్‌, ఏఈ ఆర్‌.వి.సుబ్బయ్య, మాజీ జడ్పీటీసీలు మారం వెంకటరెడ్డి, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మండల వైసీపీ అధ్యక్షుడు ఐ.వేణుగోపాల్‌రెడ్డి, గ్రామసచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement