Viral Video: 6 అడుగుల స్థలంలో 4 అంతస్థుల భవనం.. కిచెన్ నుంచి బెడ్రూం వరకు సకల సౌకర్యాలు.. ఇల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

ABN , First Publish Date - 2022-02-11T22:41:37+05:30 IST

హైదారాబాద్, చెన్నై, ముంబై తదితర మహా నగరాల్లో మూరెడు స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంది. బీహార్‌లో ఓ వ్యక్తి ఇలానే చేశాడు. అయితే అతడు కట్టిన ఇల్లు.. ప్రస్తుతం హాట్‌టాపిక్‌‌గా మారింది...

Viral Video: 6 అడుగుల స్థలంలో 4 అంతస్థుల భవనం.. కిచెన్ నుంచి బెడ్రూం వరకు సకల సౌకర్యాలు.. ఇల్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

జనాభా పెరిగేకొద్దీ అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో స్థలాల విలువ భారీగా పెరిగిపోయింది. ఇక పట్టణాలు, నగరాల్లోని స్థలాలకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హైదారాబాద్, చెన్నై, ముంబై తదితర మహా నగరాల్లో మూరెడు స్థలాన్ని కూడా సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఉంది. బీహార్‌లో ఓ వ్యక్తి ఇలానే చేశాడు. అయితే అతడు కట్టిన ఇల్లు.. ప్రస్తుతం హాట్‌టాపిక్‌‌గా మారింది. ఆరు అడుగుల స్థలంలో నాలుగు అంతస్థుల భవనం నిర్మించి వార్తల్లోకి ఎక్కాడు. వివరాల్లోకి వెళితే..


బీహార్‌ ముజఫర్‌నగర్‌కు చెందిన సంతోష్, అర్చన దంపతులు.. తమ సొంతింటి కల నెరవేర్చుకోవడంకోసం, కలాంబాగ్ చౌక్ నుంచి రామ్‌దయాలు మీదుగా గన్నిపూర్‌కు వెళ్లే దారిలో 6అడుగుల వెడల్పు, 45అడుగుల పొడవు గల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అయితే ఇంత చిన్న స్థలంలో ఇల్లు ఎలా కట్టుకోవాలో వారికి అర్థం కాలేదు. కానీ తమ వివాహ జ్ఞాపకార్థంగా ఇల్లు నిర్మించుకోవాలనేది వారి చిరకాల కోరిక. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించారు. బీహార్‌కు చెందిన ఓ తాపీ మేస్త్రీని కలిసి, భవన నిర్మాణానికి సంబంధిచిన ప్లాన్‌ను తయారు చేసుకున్నారు. మొత్తానికి ఆ స్థలంలోనే 2012లో ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ప్రియుడు అందుకు ఒప్పుకోలేదని కోపం పెంచుకుంది... ఓ రోజు అర్ధరాత్రి అతడి ఇంటికి వెళ్లి ఆమె ఏం చేసిందంటే..


నాలుగు అంతస్థుల భవన నిర్మాణాన్ని ఎట్టకేలకు 2015కల్లా పూర్తి చేశారు. భవనానికి ముందు భాగంలో మెట్లు నిర్మించగా.. మరో భాగంలో గదులను నిర్మించారు. ప్రతి అంతస్థులో 5 అడుగుల వెడల్పు, 11అడుగుల పొడవుతో ఫ్లాట్‌ను నిర్మించారు. కింది అంతస్థులో హాల్ కోసం స్థలాన్ని వదిలి, భవనం పైకి వెళ్లేందుకు మెట్లు ఏర్పాటు చేశారు. మూడున్నర అడుగుల స్థలంలో మరుగుదొడ్డి నిర్మాణంతో పాటూ అన్ని సౌకర్యాలనూ ఏర్పాటు చేశారు. మొత్తం మీద తక్కువ స్థలంలో తమ కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. ఈ ఇల్లు ప్రధాన రహదారిలో ఉండడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

అర్జెంట్ అంటూ కారును ఆపి మరీ టాయ్‌లెట్‌కు వెళ్లిన నవవధువు.. ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..


సంతోష్ దంపతులు కొన్నాళ్లు ఇందులో నివాసం ఉన్నా.. మూడేళ్లుగా ఈ ఇంటిని వాణిజ్య అవసరాలకు అద్దెకు ఇచ్చారు. కొన్ని పోర్షన్స్‌ను  సందీప్‌కుమార్ అనే వ్యక్తి అద్దెకు తీసుకోగా.. మరికొన్ని పోర్షన్స్‌లో ఉపాధ్యాయులు ఉంటున్నారు. మొదట కొంచెం ఇబ్బందిగా ఉన్నా.. ప్రస్తుతం అలవాటు పడ్డామని వారంతా చెబుతున్నారు. ఈ ఇంటి చుట్టూ పెద్ద భవనాలేవీ లేకపోవడంతో చూసేందుకు ఒంటి స్తంభంలా కనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలా మంది ఈ ఇంటిని ఆసక్తిగా గమనిస్తుంటారు. స్థానికులు ఈ ఇంటిని బీహార్ ఈఫిల్ టవర్, వండర్ హౌస్ అంటూ పిలుచుకుంటారు. ఒక్కసారిగా ఈ ఇల్లు వార్తల్లోకి ఎక్కడంతో సంతోష్ దంపతులతో పాటూ అద్దెకు ఉంటున్న వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

పిచ్చుక మృతితో గ్రామమంతా శోకసంద్రం.. దాని మీద ప్రేమతో ప్రజలంతా ఏం చేశారంటే..



Updated Date - 2022-02-11T22:41:37+05:30 IST