నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు

ABN , First Publish Date - 2022-10-07T04:43:16+05:30 IST

అది మండలంలోని మారుమూల గిరిజన గ్రామం నిషాని. గ్రామా నికి ఒకవైపు దట్టమైన అడవి మరో వైపు రెండు వైపులా కుమరం భీం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌. మధ్యలో గ్రామం. ఆ గ్రామంలో సుమారు 220 నివాస గృహాలు ఉంటాయి. ఆ గ్రామంలో 2008సంవత్సరంలో ఐటీడీఏ నిధుల ద్వారా గిరిజ నులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్‌సెంటర్‌ భవనాన్ని సుమారు రూ.12లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించారు.

నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు
నిషానిలోని ఆరోగ్య ఉపకేంద్రం

కెరమెరి, అక్టోబరు 6: అది మండలంలోని మారుమూల గిరిజన గ్రామం నిషాని. గ్రామా నికి ఒకవైపు దట్టమైన అడవి మరో వైపు రెండు వైపులా కుమరం భీం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌. మధ్యలో గ్రామం. ఆ గ్రామంలో సుమారు 220 నివాస గృహాలు ఉంటాయి. ఆ గ్రామంలో 2008సంవత్సరంలో ఐటీడీఏ నిధుల ద్వారా గిరిజ నులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సబ్‌సెంటర్‌ భవనాన్ని సుమారు రూ.12లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించారు. అయితే అదినేటికీ పూర్తికాలేదు. నిషాని గ్రామంతోపాటు అనుబంధంగా ఉన్న దేవుడు పల్లి, ఇందాపూర్‌, ఇందాపూర్‌ గోండ్‌ గూడ, ఉమ్రి గ్రామాల ప్రజలు వైద్యం కోసం మండల కేంద్రమైన కెరమెరి, జిల్లా కేంద్రమైన ఆసిఫా బాద్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సబ్‌ సెంట ర్‌ను వెంటనే నిర్మించి ప్రారం భిస్తే సౌకర్యవం తంగా ఉంటుం దని గ్రామస్థులు కోరుతున్నారు. తమ గ్రామం సమీపంలోకి భీం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ రావడంతో పాములు, ఇతర విష పురుగుల నుంచి రక్షణలేకుండా పోయింద న్నారు. ఏదైనా విషపురుగు కాటేస్తే వైద్యం అందక ప్రాణాలు పోవాల్సిందేనని గ్రామస్థులు ఆందో ళన చెందుతున్నారు.

సబ్‌ సెంటర్‌ను ప్రారంభించాలి

- సోంబాయి, నిషాని

అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యంగా వర్షాకాలంలో గ్రామంలో వైద్యసేవలకు గర్భిణులు, వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సబ్‌సెంటర్‌ను నిర్మించి వైద్య సేవలు అందించాలి.

Updated Date - 2022-10-07T04:43:16+05:30 IST