నిర్మించినా నిరుపయోగం

ABN , First Publish Date - 2022-05-18T04:30:58+05:30 IST

వనపర్తి మండలం లోని పెద్దగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిం చిన కూరగాయల మార్కెట్‌ నిరుపయోగంగా మారింది.

నిర్మించినా నిరుపయోగం
తాళాలతో దర్శనమిస్తున్న నూతన కూరగాయల మార్కెట్‌

- వినియోగంలోకి రాని కూరగాయల మార్కెట్‌

- ఆరుబయటే క్రయ విక్రయాలు 

- ఎండొచ్చినా, వానొచ్చినా ఆగని కొనుగోళ్లు 

- వ్యాపారులకు తప్పని పన్నుపోటు 


వనపర్తి రూరల్‌, మే 17: వనపర్తి మండలం లోని పెద్దగూడెం గ్రామంలో నూతనంగా నిర్మిం చిన కూరగాయల మార్కెట్‌ నిరుపయోగంగా మారింది. గత కొన్నేళ్ల నుంచి గ్రామ బస్టాండ్‌ ప్రాంతంలో ప్రతీ మంగళవారం కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. మండలంలోని కడుకుంట్ల, కిష్టగిరి, వనపర్తి తదితర గ్రామాల నుంచి వ్యాపారులు కూరగాయలను తీసుకొచ్చి రోడ్డుకు ఇరువైపులా పెట్టి ఎండా, వాన తేడా లే కుండా అమ్ముతుంటారు. కూరగాయల కొను గోలుకు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ఎక్కువమంది రావడంతో రోడ్డు కిక్కిరిసిపోతోంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగు తోంది. ఈమధ్యకాలంలో గ్రామ శివారులో ప్రభు త్వం నూతనంగా కూరగాయల మార్కెట్‌ను ని ర్మించింది. మార్కెట్‌లో గదుల మాదిరిగా ఏర్పా టుచేసి వ్యాపారులు ఒక్కొక్కరికి ఒక గదిని అప్ప జెప్పారు. అయితే, గదులు చిన్నగా ఉండడం, కూ రగాయలను విక్రయించేందుకు స్థలం సరిపోక పోవడంతో వ్యాపారులు ఆరుబయట  విక్రయా లు కొనసాగిస్తున్నారు. వ్యాపారులెవరూ మార్కెట్‌ లో క్రయ విక్రయాలు కొనసాగించకపోవడంతో మార్కెట్‌ తాళాలతో దర్శనమిస్తోంది. నూతనంగా నిర్మించిన మార్కెట్‌ను వినియోగించకపోతే నిరు పయోగంగా మారి శిథిలావస్థకు చేరే ప్రమాద ముంది. మార్కెట్‌ను విశాలం చేసి, గదులను పెద్దవిగా నిర్మిస్తే కూరగాయల క్రయ విక్రయాలు సులువుతరం అయ్యేదని వ్యాపారులు పేర్కొం టున్నారు. ఆరుబయట కూరగాయలు విక్రయించి నా పన్ను మాత్రం యదావిధిగా వసూలు చేస్తు న్నారని వారు వాపోతున్నారు. 



Updated Date - 2022-05-18T04:30:58+05:30 IST