భవన నిర్మాణ కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2020-06-04T09:31:32+05:30 IST

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జీవీ రమణ డిమాండ్‌ ..

భవన నిర్మాణ కార్మికుల నిరసన

పార్వతీపురంటౌన్‌, జూన్‌ 3: భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి జీవీ రమణ డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు బుధవారం పట్టణంలో  ప్లకార్డులతో నిరసన తెలి పారు. అనంతరం సచివాలయ అధికారులకు వినతపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కారణంగా భవన నిర్మాణ   కార్మికులు 3 నెలలుగా పనులు లేక  నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్థికంగా కార్మికుల కుటుంబాలు చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికశాఖతో పాటు ప్రభుత్వం స్పందించి వారికి  న్యాయం చేయాలని, ప్రతి కార్మికుడికి రూ.10వేలు ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరారు. 


బలిజిపేట:  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు వై.మన్మథరావు ఆధ్వర్యంలో తాపీమేస్త్రీలు, రాడ్‌బెండింగ్‌, పెయింటర్స్‌, కార్పెంటర్స్‌, భవన నిర్మాణ కార్మికులు  బలిజిపేట సచివాలయ ఆవరణలో నిరసన తెలిపారు. సీఐటీయూ మండల కార్యదర్శి పైల సత్యనారాయణ, ఉపాఽధ్యక్షుడు మజ్జిగౌరి, రాము, మురళి తదితరులు పాల్గొన్నారు. 


సీతానగరం: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులు ఆయా గ్రామ సచివాలయాల పరిధిలో ధర్నాలు చేసి సచివాలయ అధికారులకు వినతులు అందించారు. సీఐటీయూ మండల కార్యదర్శి జి.వెంటరమణ, భవన నిర్మాణ కార్మిక  సంఘం జిల్లా కార్యదర్శి రాయిపల్లి రాము, ఈశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు తోలాపు రమేష్‌, సంఘం అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.


బొబ్బిలి: మల్లమ్మపేట, కంచరవీధిలోని సచివాలయాల ముందు భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ నాయకులు వి.ఇందిర ఆధ్వర్యంలో మల్లమ్మపేటలో ఎం.కమల, చిన్నతల్లి, లక్ష్మి, పైడమ్మ, గౌరమ్మ తదితరులు ధర్నా నిర్వహించి కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అలాగే 8,9 వార్డులకు చెందిన సచివాలయం ముందు కర్ర పనివారు అచ్యుతరావు, కనకేశ్వరరావు, హరి  ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 


 తెర్లాం:  సీఐటీయూ మండల కార్యదర్శి ఎస్‌.గోపాలం ఆధ్వర్యంలో తెర్లాం సచివాల యం వద్ద భవన నిర్మాణ కార్మికులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.   ఫ గరుగుబిల్లి : భవన నిర్మాణ కార్మికుల కు కార్మిక సంక్షేమ నిధి నుంచి పింఛన్లు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా  కార్యదర్శి బీవీ రమణ డిమాండ్‌ చేశారు.  నాగూరులో కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ కాలానికి సంబంధించి నెలకు రూ. 7,.500లు చెల్లించాలన్నారు. అనంతరం సచివాలయ కార్యదర్శికి వినతిపత్రం అందించారు.  మండల కార్యదర్శి దాసరి వెంకట నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-04T09:31:32+05:30 IST