పిరమిడ్‌ పడితే గెలిచినట్టే!

ABN , First Publish Date - 2020-06-08T05:30:00+05:30 IST

టేబుల్‌పై టిన్‌ క్యాన్స్‌ను పిరమిడ్స్‌లా అమర్చాలి. కింది వరుసలో ఆరు, వాటిపైన ఐదు...

పిరమిడ్‌ పడితే గెలిచినట్టే!

కావలసినవి

  1. కొన్ని టిన్‌ క్యాన్స్‌
  2. ప్లాస్టిక్‌ బాల్స్‌
  3. టేబుల్‌


ఇలా ఆడాలి!

  1. టేబుల్‌పై టిన్‌ క్యాన్స్‌ను పిరమిడ్స్‌లా అమర్చాలి. కింది వరుసలో ఆరు, వాటిపైన ఐదు, ఆ తరువాత నాలుగు... ఇలా పేర్చుకుంటూ పిరమిడ్‌ ఆకారం వచ్చేలా చూసుకోవాలి.
  2. ఒక్కొక్కరు విడిగా ఆడే ఆట ఇది. కాబట్టి ముందుగా ఒకరు టేబుల్‌కు ఐదు అడుగుల దూరంలో నిలుచుని బాల్‌తో పిరమిడ్‌ను కొట్టాలి.
  3. ఒకరి తరువాత ఒకరు ఆడాలి. ఒక నిమిషం సమయం లోపల, తక్కువ బాల్స్‌తో పిరమిడ్‌ను పూర్తిగా పడగొట్టిన వారు గెలిచినట్టు!

Updated Date - 2020-06-08T05:30:00+05:30 IST