కొమ్ములు లేని దున్నపోతు రఘురామరాజు: పెద్దిరెడ్డి

ABN , First Publish Date - 2021-03-12T00:36:05+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రఘురామకృష్ణరాజు బ్లాక్‌ షీప్‌ అంటూ

కొమ్ములు లేని దున్నపోతు రఘురామరాజు: పెద్దిరెడ్డి

తిరుపతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. రఘురామకృష్ణరాజు బ్లాక్‌ షీప్‌ అంటూ విరుచుకుపడ్డారు. కొమ్ములు లేని దున్నపోతు రఘురామరాజు అని విరుచుకుపడ్డారు. ఆయనకు సిగ్గుంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయన స్వపక్షంలోనే విపక్షంగా మారారు. సీఎం జగన్‌ను మొదలుకొని వైసీపీ నేతలపై ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. రఘురామ ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన సందర్భాలు లేకపోలేదు. 


ఇటీవల సీఎం జగన్‌ వైఖరిపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పోలవరం గురించి అమిత్‌షాతో జగన్‌ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది కాకుండా ఇంకే అంశాలపై మాట్లాడారో బయటపెట్టాలి. సీఎం అంటే పెద్ద పాలేరు. అంటే పెద్ద పాలకుడు. అంతేగానీ ‘గ్రేట్‌మ్యాన్‌’ అనుకుంటున్నారా? ప్రజల దయాదాక్షిణ్యాలతోనే సీఎం అయ్యారన్న వాస్తవం గుర్తుపెట్టుకోండి. కలల రాజధాని విశాఖలో రావాలన్నా, సీమ సస్యశ్యామలం కావాలన్నా.. పోలవరం అవసరం. దీని గురించి షాతో మాట్లాడకుండా.. మాట్లాడినట్లు అబద్ధం చెప్పి, ప్రజలను మోసం చేస్తారా? సీఎం గారూ, మీ వెనుక వందిమాగధులు, గోముఖ వ్యాఘ్రాలు ఉన్నాయి.. జాగ్రత్త. నేను రెడ్డిని కానుగనుక నన్ను ఎలాగూ నమ్మరు. ఇప్పటికైనా గ్రహించి మీ చుట్టూ ఉన్న గోముఖ వ్యాఘ్రాల పనిపట్టాలి. సుశిక్షితుడైన పార్టీ వ్యక్తిగా నేను మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నాను. నాపై ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నందునే బీజెపీతో దగ్గరవుతున్నట్లు ఒక పెద్దరెడ్డి సీఎంకు చెప్పారట. అలాగైతే సీఎంపై 33 చార్జిషీట్లు ఉన్నాయి. అందుకే ఆయన బీజెపీకి దగ్గరగా ఉన్నట్టా? ఆ పెద్దరెడ్డి నన్ను విమర్శిస్తూ పరోక్షంగా సీఎంను అవమానిస్తున్నారు’’ అని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-03-12T00:36:05+05:30 IST