Abn logo
Sep 21 2021 @ 12:01PM

జోగి రమేశ్‌కు ఉన్న అర్హత ఏంటి?: బుద్ధా వెంకన్న

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి గుంటూరు డీఐజీ త్రివిక్రమవర్మ సినిమా కథను బాగా అల్లారని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. నిన్న త్రివిక్రమవర్మ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో జోగి రమేశ్‌ మాట్లాడేందుకు వచ్చారని డీఐజీ ఎలా చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబుతో మాట్లాడడానికి జోగి రమేశ్‌కు ఉన్న అర్హత ఏంటని నిలదీశారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ లేకుండా ఎలా కలుస్తారన్నారు. డీఐజీ స్థాయి వ్యక్తి పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారని, తప్పు చేసే పోలీసులను కోర్టు బోనులో నిలబెడతామని బుద్ధా వెంకన్న హెచ్చరించారు.

ఇవి కూడా చదవండిImage Caption