Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ నుంచే లోకేష్ విజయ శంఖారావం: బుద్దా వెంకన్న

విశాఖ: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విశాఖ నుంచే విజయ శంఖారావం పూరిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర బందిపోటు విజయసాయిరెడ్డని.. చంబల్ లోయలో ఉండాల్సిన ఆయన ఉత్తరాంధ్రలో తిరుగుతున్నారని అన్నారు. విశాఖలో ఫ్యాక్టరీలపై విజయసాయిరెడ్డి ఫైన్‌లు వేస్తున్నారని ఆరోపించారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. విజయసాయిరెడ్డి అక్రమాలపై అతనికి సహకరించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. బాధితుల భూములు తిరిగి వారికి ఇస్తామని స్పష్టం చేశారు.


రాక్షసుడికి రక్తం మీద, విజయసాయి రెడ్డికి ధనం మీద వ్యామోహం ఉంటుందని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిని ఉత్తరాంధ్ర నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉందని వెంకన్న అన్నారు. విజయ దర్బార్ ద్వారా,  సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. టూరిస్టు గెస్ట్ హౌస్‌ను పగలగొట్టి విజయసాయిరెడ్డి తన కూతురుకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కొండలు, ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వైన్ షాపుల్లో, కట్టే డబ్బులన్నీ తాడేపల్లికి వెళ్తున్నాయన్నారు. 2024లో అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే  విజయసాయిరెడ్డికి పడుతుందని బుద్దా వెంకన్న అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement