ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘనంగా బుద్ధ జయంతి

ABN , First Publish Date - 2022-05-17T04:03:51+05:30 IST

మండలంలోని పలుగ్రామాల్లో సోమవారం ప్రజలు బుద్ధజయంతిని ఘనంగా జరు పుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పంచశీల్‌ జెండాలను ఎగరువేసి గౌతమ బుద్ధుడికి నివాళులు అర్పించారు. గౌతమబుద్ధుడి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఘనంగా బుద్ధ జయంతి
వాంకిడిలో నివాళులర్పిస్తున్న అంబేద్కర్‌ సంఘం నాయకులు

వాంకిడి, మే 16: మండలంలోని పలుగ్రామాల్లో సోమవారం ప్రజలు బుద్ధజయంతిని ఘనంగా జరు పుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పంచశీల్‌ జెండాలను ఎగరువేసి గౌతమ బుద్ధుడికి నివాళులు అర్పించారు. గౌతమబుద్ధుడి బోధనలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.

బుద్ధ విహార్‌ నిర్మాణానికి కృషి చేయాలి

మండల కేంద్రంలో నిర్మిస్తున్న జేతావన్‌ బుద్ధవి హార్‌ నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని అంబేద్కర్‌ యువజనసంఘం అధ్య క్షుడు జైరాంఉప్రె కోరారు. మండలకేంద్రంలో నిర్మి స్తున్న బుద్ధవిహార్‌ నిర్మాణానికి రూ.1,11,111నగదు అందించిన ఆసిఫాబాద్‌ సెంటర్‌కమిటీ అధ్యక్షుడు అశోక్‌ మహోల్‌కార్‌, రూ. 1,11,111 నగదు అందించినా అంబేద్కర్‌ యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు దుర్గాజీ దుర్గె, రూ.1,00,111 నగదు అందించిన ఎంపీ టీసీ పితాంబర్‌ ఉప్రె, రూ.50,111 నగదు అందించిన ఎంపీటీసీ పితాంబర్‌ సతీమణి సవితా ఉప్రెను ఈ సందర్భంగా శాలువాతో సన్మానించారు. ఈ సదర్భం గా ఆయన మాట్లా డుతూ బుద్ధవిహార్‌ నిర్మాణానికి దాతలు ఎవరైనా తమవంతు సహకారాన్ని అందించా లన్నారు.  కార్యక్రమం లో ఆసిఫాబాద్‌ అంబే ద్కర్‌ సెంటర్‌ కమిటీ అధ్య క్షుడు అశోక్‌, అధ్యక్షుడు జైరాం, ఉపాధక్ష్యుడు సునీల్‌, దుర్గాజీ,సంఘంనాయకులు దుర్గం శ్యాంరావు, విజయ్‌, సునీల్‌,  రోషన్‌, విలాస్‌, సందీప్‌, ప్రతాప్‌, ప్రసాద్‌, నాగ్‌సేన్‌, పాండుజీ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా బుద్ధ పూర్ణిమ

సిర్పూరు(టి): మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో బుద్ధిడి విగ్రహ ప్రతిష్ఠాపన వద్ద బుద్ధ పూర్ణిమ సందర్భంగా బౌద్ధ దమ్మ దీక్ష గురువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని అంబే ద్కర్‌ భవన్‌లో కార్యక్రమాలను చేపట్టారు. కార్యక్రమంలో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ సువర్ణ, ఎంపీటీసీలున్నారు.

మజ్జిగ పంపిణీ 

కాగజ్‌నగర్‌: బుద్ధ జయంతిని పురస్కరించు కొని కాగజ్‌నగర్‌ పట్టణంలోని బస్టాండు సమీపంలో సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధుడి బోధనలను పాటించాలన్నారు. కార్యక్రమంలో తేజస్విని, సంజయ్‌, జాడి సుధాకర్‌, మేడి చరందాజ్‌, మేడి కార్తిక్‌, తిరుపతి, దేవా, రాంచందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T04:03:51+05:30 IST