విజయసాయిరెడ్డి సుమోటోకు కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-05-31T16:50:05+05:30 IST

వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లకు బుద్దా వెంకన్న తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు కూడా బుద్దా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు.

విజయసాయిరెడ్డి సుమోటోకు కౌంటర్ ఇచ్చిన బుద్దా వెంకన్న

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్దా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. విజయసాయిరెడ్డి చేసే ట్వీట్లకు బుద్దా వెంకన్న తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌కు కూడా బుద్దా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు.


‘‘గ్యాస్ బాధితుల్ని పరామర్శిస్తానని సుమోటోగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెనక్కి వెళ్ళాడు ఒకాయన. నాకు నేనే సుమోటోగా ఎన్నికల కమిషనర్ని అని ఆర్డర్ ఇచ్చుకున్నాడు ఇంకొకాయన. అసలు ఈ సుమోటోలు ఏమిటో...!?’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


‘‘సుమోటో అనే పదం మీకు అర్ధం కాకపోవడం ఏంటి విజయసాయిరెడ్డి. సుమోటోగా 16 నెలలు జైలు శిక్ష, సుమోటోగా 11 కేసుల్లో ఏ1, ఏ2 ముద్దాయిలుగా ఎదగడం ఇవ్వన్నీ సుమోటోగా చేసుకున్న స్వయంకృపరాదాలే కదా! అంతెందుకు మొన్న జగన్ గారు సుమోటోగా మిమ్మల్ని కారులోంచి దించేసి విశాఖ బాధ్యతలను తొలగించారని తాడేపల్లి సంస్థానం టాక్. అన్నట్టు సుమోటోగా చంద్రబాబు గారి విశాఖ పర్యటనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి, వెన్నులో వణుకుపుట్టి వైఎస్ జగన్ గారు ఫ్లైట్స్ రద్దు చేశారు గుర్తులేదా? సుమోటోగా అల్జిమర్స్ వ్యాధి తెచ్చుకున్నారా సాయిరెడ్డి గారు?’’ అంటూ బుద్దా వెంకన్న కౌంటర్ ట్వీట్ చేశారు.





Updated Date - 2020-05-31T16:50:05+05:30 IST