విజయవాడ: వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా విజయసాయిపై వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రపంచంలో ఉన్న చెత్త పనులు అన్ని చేసి.. ఇప్పుడు కులం, మీడియా అంటూ ప్యాంట్ చించుకోవడమెందుకని ప్రశ్నించారు. పదవిని అడ్డుపెట్టుకుని జగన్ వెనక నుంచి రాసిన దొంగ లెక్కలు, వాటాల చిట్టా, జిఓల వెనుక ఉన్న క్విడ్ ప్రో కో అందరూ చేస్తారనుకుంటే ఎలా అన్నారు. అప్పటి బొక్కలు బయటపడకుండా బ్లాక్ పేపర్‌తో మహా మేత అని ఎంత డప్పు కొట్టించినా సీబీఐ, ఈడీ ద్వారా బయటపడ్డాయని బుద్దా ట్వీట్ చేశారు.