Abn logo
Sep 25 2020 @ 01:36AM

బుచ్చిబాబు సానా, దర్శకుడు

Kaakateeya

కాకినాడలోని అందమైన సముద్ర తీర ప్రాంతం ఉప్పాడ. మా సొంతూరు. షూటింగ్‌ అక్కడే చేశాం. హీరో జాలరుల కుటుంబానికి చెందినవాడు. అతడు చిన్నప్పుడు దర్గా దగ్గర ఒక అమ్మాయిని చూస్తాడు. అప్పటి నుంచి ఆమెకు కనిపించకుండా ప్రేమిస్తుంటాడు. ఈ లైన్‌ దేవీ గారికి చెబితే... ఆయన పాట కంపోజ్‌ చేశారు. ఒక మంచి సందర్భం దొరికితే దేవి గారిని ఆపలేం. దర్గా దగ్గరే కథ మొదలవుతుంది కాబట్టి ఆయన పాటను ఖవ్వాలీతో ప్రారంభించారు. ఇందులో వచ్చే తొలి రెండు పల్లవులను  దేవీ గారే రాశారు. దానికి గీత రచయిత శ్రీమణి అంతే అద్భుతంగా చరణాలు అల్లుకుపోయారు. పాటంతటినీ పల్లెటూరిలో ఎలా మాట్లాడుకొంటారో అలా సులువైన చిన్న చిన్న పదాలతో పేర్చి మాయ చేశారు.  చిత్ర పరిశ్రమలో తెలిసినవారూ, తెలియనివారూ అభినందనలు, ఆశీర్వాదాలూ అందించారు. 

బుచ్చిబాబు సానా, దర్శకుడు

Advertisement
Advertisement