Abn logo
Feb 23 2021 @ 11:45AM

బుచ్చిబాబుకు ఆ స్టార్ హీరోలు ఓకే చెప్పారా?

తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. వంద కోట్ల రూపాయల వసూళ్ల దిశగా సాగుతోంది. తొలి సినిమాతోనే ఈ అరుదైన మైలురాయిని అందుకుంటున్న దర్శకుడిగా బుచ్చిబాబు సత్తా చాటాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలోనే బుచ్చిబాబు మరో రెండు సినిమాలు చేయబోతున్నాడు. తాజాగా ఇద్దరు ప్రముఖ హీరోలకు బుచ్చిబాబు కథలు చెప్పాడట. 

ఎన్టీయార్ ఓకే చెప్పాడా?


ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీయార్‌కు బుచ్చిబాబు ఇటీవల ఓ కథ చెప్పాడట. గోదావరి జిల్లాల నేపథ్యంలో పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందట. ఈ కథ ఎన్టీయార్‌కు బాగా నచ్చిందట. అయితే `ఆర్ఆర్ఆర్` తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి ఉంది. దాని తర్వాత బుచ్చిబాబు సినిమాను ఎన్టీయార్ పట్టాలెక్కిస్తాడని తెలుస్తోంది. ఈ లోపు బుచ్చిబాబును మరో సినిమా చేసుకోమని ఎన్టీయార్ సూచించాడట. 

అఖిల్ గ్రీన్ సిగ్నల్?


అక్కినేని యంగ్ హీరో అఖిల్‌కు కూడా బుచ్చిబాబు ఓ కథ వినిపించాడట. `ఉప్పెన` తరహాలోనే ఇంటెన్స్ లవ్‌స్టోరీగా ఆ సినిమా ఉండబోతోందట. కథ అఖిల్‌కు చాలా నచ్చిందట. మైత్రీ మూవీస్ నిర్మాణంలోనే ఈ సినిమా తెరకెక్కనుందట. అఖిల్ నటిస్తున్న `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్` చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇది, పూర్తి కాగానే బుచ్చిబాబు సినిమాను అఖిల్ ప్రారంభిస్తాడని సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement