బీటీపీఎస్‌లో యూనిట్‌1 సీవోడీ ప్రక్రియ పూర్తి

ABN , First Publish Date - 2020-06-06T10:41:51+05:30 IST

భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి ఽథర్మల్‌ పవర్‌స్టేషన్‌లో యూనిట్‌ -1 కమర్షియల్‌ ఆపరేషన్‌ డే (సీవోడీ) ప్రక్రియ

బీటీపీఎస్‌లో యూనిట్‌1 సీవోడీ ప్రక్రియ పూర్తి

పత్రాలపై సంతకాలు చేసిన జెన్కో ట్రాన్స్‌కో అధికారులు


మణుగూరు, జూన్‌ 5 :  భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి ఽథర్మల్‌ పవర్‌స్టేషన్‌లో యూనిట్‌ -1 కమర్షియల్‌ ఆపరేషన్‌ డే (సీవోడీ) ప్రక్రియ శుక్రవారం ఉదయం ఆరుగంటలకు పూర్తయ్యింది. జెన్కో, ట్రాన్స్‌ కో ఇంజనీర్లు, డైరక్టర్‌ గణపతి, బీటీపీఎస్‌ సీఈ బాలరాజు ఇతర ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన సీవోడీ విజయవంతం కావడంతో జెన్కో సీఎండీ ప్రభాకర్‌ స్థానిక ఇంజనీర్లను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో బీటీపీఎస్‌ సీఈ బాలరాజు మాట్లాడారు. 2015 మార్చిలో భద్రాద్రి రాములోరి కల్యాణానికి వచ్చిన సీఎం కేసీఆర్‌ భద్రాద్రి పవర్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారని, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని యూనిట్‌-1 సీవోడీ ని ప్రక్రియను పూర్తి చేసుకుందన్నారు. దీనికి కారకులైన వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపుతున్నామన్నారు.


జెన్కో సీఎండీ ప్రభాకర్‌ ప్రత్యేక కృషి, స్వీయ పర్యవేక్షణలో డైరక్టర్ల ప్రత్యేక శ్రద్ధ, ఇంజనీర్ల కృషి కార్మిక శ్రమశక్తి వెరసి బీటీపీఎస్‌లో తొలియూనిట్‌ ట్రాన్స్‌కోతో సీవోడీ చేశామన్నారు. రెండో తేదీ నుంచి ఐదో తేదీ ఆరుగంటల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా 271.06 మెగా యూనిట్లను ఉత్పత్తిని సాధించామన్నారు. గణపతి డైరక్టర్‌ ఐపీసీ ఎన్‌ఆర్‌ఏసీ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా జెన్కో, ట్రాన్స్‌ కో అధికారులు సీవోడీ పత్రాలపై సంతకాలు చేశారు.


ప్రభుత్వ విప్‌ రేగా అభినందనలు..

బీటీపీఎస్‌ మొదటి యూనిట్‌ పనులను త్వరిగ గతిన పూర్తిచేసి సీవోడీ చేసిన ఇంజనీర్లకు ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మిగతా యూనిట్లను కూడా త్వరిత గతిన పూర్తిచేసి సీఎం కేసీఆర్‌ కలలను సాకారం చేయాలని ఆయన కోరారు. 

 

సీఎం కల సాకారమైంది.. ఇంజనీర్లకు అభినందనలు: గణపతి, డైరక్టర్‌ ఐపీసీ ఎన్‌ఆర్‌ఏసీ

భద్రాద్రి పవర్‌ స్టేషన్‌లో 270 మెగావాట్ల పవర్‌ను శుక్రవారం సీవోడీ పూర్తి చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. సీఎం కేసీఆర్‌ కలలు సాకారమయ్యేందుకు ఇది తొలిమెట్టు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడుతంది. ఇందుకు కారణమైన ఇంజనీర్లకు, కార్మికులకు ప్రత్యేక అభినందనలు. ఇదే స్ఫూర్తితో మిగతా యూనిట్లు కూడా పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నాం. 

Updated Date - 2020-06-06T10:41:51+05:30 IST