ఎస్‌ఆర్‌ఎం జేఈఈ రద్దు

ABN , First Publish Date - 2020-07-14T08:11:23+05:30 IST

కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఈ ఏడాది అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష(ఎ్‌సఆర్‌ ఎం జేఈఈ-2020)ను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 127 పరీక్షా

ఎస్‌ఆర్‌ఎం జేఈఈ రద్దు

  • ఇంటర్‌ మార్కుల ఆధారంగానే బీటెక్‌ అడ్మిషన్లు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఈ ఏడాది అడ్మిషన్ల ప్రవేశ పరీక్ష(ఎ్‌సఆర్‌ ఎం జేఈఈ-2020)ను రద్దు చేసింది.  దేశ వ్యాప్తంగా 127 పరీక్షా కేంద్రాలతో పాటు దుబాయ్‌, దోహ, మస్కట్‌, బహ్రెయిన్‌, కువైట్‌ దేశాల్లోని ఐదు నగరాల్లో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని తొలుత నిర్ణయించినప్పటికీ, కారణంగా పరీక్ష నిర్వహించడం లేదని వర్సిటీ మేనేజ్‌మెంట్‌ సోమవారం ప్రకటించింది. ఇంటర్మీడియెట్‌ మార్కుల ఆధారంగానే విద్యార్థుల అడ్మిషన్‌ ప్రక్రియ ఉంటుందని పేర్కొంది. ఇంటర్‌లో సబ్జెక్టుల వారీ మార్కులను పరిశీలించి మెరిట్‌ జాబితా తయారు చేసి, విద్యార్థులకు బీటెక్‌ అడ్మిషన్లు కల్పిస్తామని వివరించింది. పూర్తి వివరాల కోసం ఫోన్‌ నెంబర్‌ 9490099752లో సంప్రదించాలని సూచించింది. 

Updated Date - 2020-07-14T08:11:23+05:30 IST